Breaking News

బీజేపీ మహిళా నేత ఖుష్బూ అరెస్ట్


బీజేపీ మహిళా నే ఖుష్బూను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవలే ఖుష్బూ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆమె కడలూరు జిల్లాలో జరగనున్న నిరసన ప్రదర్శనలో పాల్గొనేందుకు బయల్దేరి వెళ్లారు. దీంతో ఆమెను చెంగల్‌పట్టు పోలీసులు అరెస్టు చేశారు. విదుతలై చిరుతైగల్ కచ్చి(వీసీకే) గ్రూపు చీఫ్ తోల్ తిరుమావలన్.. ఇటీవల ఓ సమావేశంలో మాట్లాడుతూ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో మహిళలపై వీసీకే అధ్యక్షుడు తిరుమావళన్‌ వ్యాఖ్యలకు నిరసనగా తమిళనాడు వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇటీవలే కాంగ్రెస్‌కు టాటా చెప్పిన కుష్బూ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. నాటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే ఈ ఆందోళనలో పాల్గొనడానికి వెళ్తున్న కుష్బూను ఈసీఆర్‌ రోడ్డులో అరెస్ట్ చేశారు. ఈ తరుణంలో గౌండంబాడిలో వీసీకే, బీజేపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పరస్పరం చెప్పులు నేతలు విసురుకున్నారు. ఈ ఘర్షణలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. భారీగా మోహరించిన పోలీసులు 15 మంది బీజేపీ నేతలను అరెస్ట్‌ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా తన చివరి శ్వాస వరకు మహిళల గౌరవాన్ని కాపాడేందుకు పోరాడతానని కుష్బూ ట్వీట్ చేశారు. Read More: తిరుమావలన్ తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా వీసీకే వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ నిరసన ప్రదర్శనకు పిలపునిచ్చింది. తిరుమావలన్ వ్యాఖ్యలు వర్గపోరుకు దారితీస్తుందని బీజేపీ ఆరోపిస్తున్నది. మరోవైపు పోలీసులు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఆయా ప్రాంతంల్లో భారీగా మోహరించారు. బీజేపీ కార్యకర్తలు, నేతలు ఇవాళ కూడా పలు నిరసనలు, ఆందోళనలు చేపట్టడంతో అప్రమత్తమై ఎక్కడికక్కడ వారిని అడ్డుకుంటున్నారు.


By October 27, 2020 at 11:29AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/tamil-nadu-police-arrest-bjp-leader-kushboo-/articleshow/78885485.cms

No comments