టీచర్ అనుమానాస్పద మృతి.. గుంటూరులో మిస్టరీగా మరణం


గుంటూరులో ఓ మహిళా టీచర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన పొన్నూరు మండలం వల్లభరావుపాలెంలో జరిగింది. గ్రామానికి చెందిన ఇందిర(34) పొన్నూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో పనిచేస్తోంది. ఆమెకు భర్త రవీంద్ర, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అనూహ్యంగా ఆమె శవమై తేలింది. ఉరేసుకుని చేసుకుందని చెబుతున్నప్పటికీ ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అత్తింటి వారే చంపేశారని ఆరోపిస్తున్నారు. భర్త, అత్తమామలు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. Also Read:
By October 14, 2020 at 09:58AM
No comments