Breaking News

చున్నీతో ఫ్యానుకి వేలాడిన కొడుకు.. అత్త అనుమానంతో కోడలు బాగోతం వెలుగులోకి..


భర్త చున్నీతో ఫ్యానుకి ఉరి వేసుకుని మృతి చెందాడని భార్య లబోదిబోమంది. అది చూసి స్థానికులు, పోలీసులు అంతా నిజమేననుకున్నారు. తీరా మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించడంతో వైద్యులు షాకింగ్ నిజాలు వెల్లడించారు. అతను ఆత్మహత్య చేసుకోలేదని.. ఉరి బిగించి దారుణంగా చంపేసినట్లు తేలింది. ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను అమానుషంగా అంతమొందించిన భార్య భాగోతం బయటపడింది. ఈ దారుణ ఘటన జిల్లాలో వెలుగుచూసింది. జిల్లాలోని కొత్తూరు రెల్లివీధికి చెందిన దూలి రాము(35)కి టెక్కలికి చెందిన కుమారితో పదేళ్ల కిందట వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు సంతానం. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన సొండి సతీష్‌తో కుమారికి ఏర్పడింది. భర్తకి తెలియకుండా రహస్యంగా రాసలీలలు సాగించేది. కొద్దిరోజులకి ఆ విషయం రాముకి తెలిసిపోవడంతో భార్యభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. తమ ఏకాంతానికి అడ్డుగా ఉన్నాడని భావించిన కుమారి ప్రియుడు సతీష్‌తో కలసి భర్తను హత్య చేయాలని నిర్ణయించుకుంది. ఈ నెల 26న సెల్‌ఫోన్ చార్జర్ వైరుతో భర్త మెడకు ఉరి బిగించి దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. భర్త శవాన్ని చున్నీతో ఫ్యాన్‌కి వేలాడదీసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అందరినీ నమ్మించింది. అయితే మృతుడి తల్లి లక్ష్మి తన కొడుకు మరణంపై అనుమానాలున్నాయని ఫిర్యాదు చేయడంతో పోలీసులు సీన్‌లోకి ఎంటరయ్యారు. Also Read: అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. అది ఆత్మహత్య కాదని.. హత్య చేసిన తరువాత ఫ్యానుకి వేలాడదీశారని స్పష్టం చేయడంతో పోలీసులు భార్య కుమారిని అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్టైల్లో విచారించడంతో ఆమె వివాహేతర సంబంధం బయటపడింది. ఆమెతో సహా ఆమె ప్రియుడు సతీష్‌ని పోలీసులు అరెస్టు చేసి కటకటాలవెనక్కి నెట్టారు. Read Also:


By October 31, 2020 at 10:02AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-kills-husband-over-extramarital-affair-in-srikakulam/articleshow/78964167.cms

No comments