దర్శకేంద్రుడి ఆగ్రహం.. రోజంతా ఏడుస్తూనే ఉన్న రంభ.. షూటింగ్ ప్యాకప్

తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు. హీరోయిన్లనూ అందంగా చూపించాలంటే ఆయన తర్వాతే ఎవరైనా అని ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెబుతుంటారు. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఆయన షూటింగ్ లొకేషన్లలోనూ అంతే సరదాగా ఉండేవారట. కానీ ఓ సందర్భంలో హీరోయిన్ రంభపై కస్సుమన్నారంట దర్శకేంద్రుడు. జేడీ చక్రవర్తి, జంటగా ఆయన డైరెక్షన్లో ‘బొంబాయి ప్రియుడు’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే ఈ చిత్రంలోని ‘గుప్పెడు గుండెను తడితే’ పాట గుర్తుంది కదా. ఇందులో హీరో రంభ నడుముపై బత్తాయిలు వేస్తుంటాడు. పాట షూటింగ్ గ్యాప్‌లో అందరూ కూర్చుని ఉన్న సమయంలో.. ‘డైరెక్టర్ గారు నీమీద పుచ్చకాయలు వేయిస్తారు’ అని చెప్పడంతో రంభ గట్టిగా నవ్వేసిందట. దీంతో చిరాకు పడ్డ రాఘవేంద్రరావు ‘మీరు నవ్వడం ఆపేశాక చెప్పండి. నేనొచ్చి షాట్ తీస్తా’ అని కోపగించుకుని వెళ్లిపోయారట. Also Read: రాఘవేంద్రరావు అలా అనేసరికి రంభ బోరున ఏడ్చేశారట. ఎవరు ఎంత నచ్చజెప్పినా ఆమె ఏడుపు ఆపకపోవడంతో ఈ రోజు పాటకు ప్యాకప్ చెప్పేసి... మరుసటి రోజు షూటింగ్ కొనసాగించారు. ‘షాట్‌లో నా తప్పు లేకుండా నన్ను అంటే నాకు కోపం వస్తుంది. నేను చాలా సెన్సిటివ్’ అని ఓ సందర్భంగా రంభ చెప్పుకొచ్చింది. Also Read:
By October 29, 2020 at 12:19PM
No comments