ఆ ఒక్కమాటే శాపం.! చెల్లెలిపై అత్యాచారం, నలుగురిని నరికి దారుణ హత్య
బతుకుదెరువు కోసం రాష్ట్రం దాటి వచ్చిన గిరిజన కుటుంబంలో ఘోరం జరిగిపోయింది. అనుకోకుండా సొంతూరు వెళ్లాల్సి రావడంతో నలుగురు చిన్నారులను ఇంట్లోనే వదిలి వెళ్లారు. ఊరెళ్తూ తన తమ్ముళ్లు, చెల్లెళ్లను చూసుకోవాల్సిందిగా పెద్దకొడుకు తన స్నేహితులకు చెప్పి వెళ్లాడు. అదే వారి పాలిట శాపంగా మారింది. మద్యం మత్తులో ఇంటకెళ్లిన దుర్మార్గులు చెల్లెలిపై అత్యాచారం చేసి కిరాకతంగా చంపేశారు. అది చూసిన మిగిలిన ముగ్గురిని కూడా అమానుషంగా అంతమొందించారు. మహారాష్ట్రలోని జల్గావ్‌లో సంచలనం రేపిన నలుగురు చిన్నారుల హత్య కేసును పోలీసులు ఛేదించారు. మధ్యప్రదేశ్‌కి చెందిన గిరిజన కుటుంబం బతుకుదెరువు కోసం ఎనిమిదేళ్ల కిందట జల్గావ్ జిల్లాలోని రవేర్ పరిధిలోని బొర్ఖేదా గ్రామానికి వలసొచ్చింది. అక్కడే అరటితోటలో పనికి కుదిరిన పేద దంపతులు పొలం వద్దే చిన్న గుడిసె వేసుకుని నివాసం ఉంటున్నారు. వారికి ఐదుగురు సంతానం. కుటుంబ సభ్యుడు చనిపోవడంతో అంత్యక్రియల కోసం స్వగ్రామానికి వెళ్లాల్సి వచ్చింది. మెహతాజ్, రుమాలీ బాయ్ భిలాలా దంపతులు పెద్దకొడుకు సంజయ్(16)ని తీసుకుని సొంతూరు వెళ్లారు. మిగిలిన ఇద్దరు కూతుళ్లు(12, 3), కొడుకులను(11, 8) చూసుకోవాల్సిందిగా పొలం యజమానికి చెప్పి వెళ్లారు. ఊరి శివారులో ఇల్లు కావడంతో తన తమ్ముళ్లు, చెల్లెళ్లను చూసుకోమని సంజయ్ తన స్నేహితులకు చెప్పాడు. అతని పెద్ద చెల్లెలిపై కన్నేసిన దుర్మార్గులు అదే అదనుగా భావించారు. ఫుల్లుగా మద్యం తాగి ఇంటికెళ్లి బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. పశువుల్లా మీద పడి కామవాంఛలు తీర్చుకున్నారు. అంతటితో ఆగని కీచకులు విషయం బయటికి తెలిసిపోతుందేమోనన్న భయంతో దారుణానికి ఒడిగట్టారు. నలుగురు చిన్నారులను దారుణంగా గొడ్డలితో నరికి చంపేసి అక్కడి నుంచి పరారయ్యారు. Also Read: మరుసటి రోజు ఉదయం పిల్లలను పలకరించేందుకు వెళ్లిన పొలం యజమాని రక్తపు మడుగులో పడి ఉన్న చిన్నారులను చూసి షాక్‌కి గురయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. నలుగురు చిన్నారుల హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. వెంటనే అక్కడి ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)ను ఏర్పాటు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పోస్టుమార్టం రిపోర్ట్ అనంతరం మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే నిందితులను అరెస్టు చేసినట్లు ఆ రాష్ట్ర మంత్రి ట్విటర్‌లో ప్రకటించారు. Read Also:
By October 18, 2020 at 11:10AM
No comments