కరోనా గురించి కొత్త విషయం.. చర్మంపై 9 గంటలు మనుగడ: జపాన్ స్టడీ
ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి గురించి రోజుకో కొత్త విషయాన్ని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. శాస్త్రవేత్తల అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏదైనా ఉపరితలం లేక ఏదైనా వస్తువును తాకి, అదే చేతుల్తో తమ ముఖాన్ని తాకడం అనేది వైరస్ వ్యాపించడానికి ప్రధాన కారణం కాదు అని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెప్పింది. అయితే, సీడీసీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర ఆరోగ్య సంస్థలు అన్నీ వ్యాప్తిని అడ్డుకోడానికి మనం చేతులు శుభ్రంగా కడుక్కోవడం, తరచూ తాకే ఉపరితలాలను క్రిమిరహితం చేయడం రెండూ ముఖ్యమే అని గట్టిగా చెబుతున్నాయి. Read Also: కోవిడ్-19 వ్యాధికి కారణమైన సార్స్-CoV-2 అనే ఈ వైరస్ కచ్చితంగా ఎంతకాలం పాటు మనిషి శరీరం బయట ఉంటుంది అనే ఒక్క విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. సార్స్, మెర్స్ సహా ఇతర కరోనా వైరస్‌లపై జరిగిన కొన్ని అధ్యయనాల్లో పూర్తిగా క్రిమిరహితం చేయనంతవరకూ అవి లోహం, గ్లాస్, ప్లాస్టిక్ మీద 9 రోజుల వరకూ బతకగలవని, వాటిలో కొన్ని బయట కనిష్ట ఉష్ణోగ్రతల్లో 28 రోజుల వరకూ సజీవంగా ఉంటాయిని కనుగొన్నారు. తాజాగా, మానవ శరీరంపై కరోనా వైరస్ 9 గంటల వరకు మనుగడ సాగించగలదని ఓ పరిశోధనలో వెల్లడయ్యింది. Read Also: శరీరంపై 9 గంటల వరకు యాక్టివ్‌గా ఉంటుందని జపాన్ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో గుర్తించారు. సాధారణ ఫ్లూకి కారణమయ్యే వైరస్ మానవ చర్మంపై సుమారు 1.8 గంటలు జీవించి ఉంటుందని, దాంతో పోల్చితే ఇది ఐదు రెట్లు ఎక్కువ కాలం జీవిస్తుందని క్లినికల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం తెలిపింది. ‘మానవ చర్మంపై SARS-CoV-2 (కోవిడ్ -19 కి కారణమయ్యే వైరస్ జాతి) తొమ్మిది గంటల మనుగడ ఇన్‌ఫ్లూయేంజా ఏ వైరస్‌తో పోల్చితే కాంటాక్ట్ ద్వారా వైరస్ వ్యాప్తి ముప్పు పెంచుతుంది, తద్వారా మహమ్మారిని వేగవంతం చేస్తుంది’ అని శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించారు. Read Also: వ్యక్తి చినపోయిన ఒక రోజు తర్వాత శవపరీక్ష నమూనాల నుంచి సేకరించిన చర్మాన్ని పరిశోధనా బృందం పరీక్షించింది. కరోనా వైరస్, ఫ్లూ రెండూ శానిటైజర్ల తయారీలో వాడే ఇథనాల్‌ను ఉపయోగించడం వల్ల 15 సెకన్లలో క్రియారహితమయ్యాయి. ‘మానవ చర్మంపై ఎక్కువ కాలం సార్స్-కోవి-2 మనుగడ కరోనా వైరస్ కాంటాక్ట్ ద్వారా సంక్రమించే ముప్పు పెరుగుతుంది.. ఏదిఏమైనా చేతులు శుభ్రం చేసుకోవడం వల్ల ముప్పు తగ్గించుకోవచ్చు’ అని అధ్యయనకర్తలు పేర్కొన్నారు. Read Also:
By October 18, 2020 at 12:33PM
No comments