చైనాతో ఉద్రిక్తతలు: 35 రోజుల్లో 10 క్షిపణి ప్రయోగాలు.. ఇదేం యాదృశ్చికం కాదు!
తూర్పు లడఖ్ సరిహద్దుల్లో చైనాతో ప్రతిష్టంభన నెలకున్న వేళ.. వరుసగా భారత్ క్షిపణి ప్రయోగాలను నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే వారం 800 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించే నిర్భయ్ సబ్-సోనిక్ క్రూయిజ్ క్షిపణిని డీఆర్డీఓ పరీక్షించనుంది. దీంతో 35 రోజుల్లోనే భారత్ క్షిపణి ప్రయోగాల సంఖ్య 10కి చేరుతుంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకున్న వేళ వ్యూహాత్మక క్షిపణులన్నింటినీ స్వదేశంలో తయారు చేయాలని ప్రధాని పిలుపునిచ్చిన నేపథ్యంలో క్షిపణి తయారీలో డీఆర్‌డీవో దూకుడు పెంచింది. Read Also: గత నెలలో 4 రోజులకు ఒక క్షిపణి చొప్పున పరీక్షించింది. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి చైనాతో ప్రతిష్టంబన మొదలైన తొలినాళ్లలోనే కేంద్రం అప్రమత్తమైందని రక్షణ శాఖకు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు. మన భూభాగాన్ని ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తోన్న చైనా అంత సులభంగా వెనక్కి వెళ్లదని భారత్ ముందే పసిగట్టిందని ఆయన వెల్లడించారు. ఆ నేపథ్యంలోనే డీఆర్‌డీవో శరవేగంగా క్షిపణులను రూపొందిస్తోంది. 400 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను సునాయాసంగా చేరుకోగల బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి, అణు సామర్థ్యం కలిగిన శౌర్య సూపర్ సోనిక్ క్షిపణి, సబ్‌మెరైన్లను ధ్వంసం చేయగల క్షిపణి సహాయక టోర్పెడో, లేజర్ గైడెడ్ యాంటీ టాంక్ క్షిపణి వంటి కీలక ప్రయోగాలను డీఆర్‌డీవో విజయవంతంగా పూర్తి చేసింది. Read Also: అణు సామర్థ్యంతో 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల బాలిస్టిక్ క్షిపణి పృథ్వి-2 ప్రయోగాన్ని రాత్రి వేళలో నిర్వహించింది. ఇది ఉపరితలం నుంచి ఉపరితలంపై ప్రయోగించే తొలి దేశీయ క్షిపణి. ఇప్పటికే సరిహద్దు వెంబడి నిర్భయ్ క్షిపణులు సిద్ధంగా ఉన్నాయి. త్వరలో శౌర్య క్షిపణులను కూడా బరిలోకి దిగుతున్నాయి. Read Also: మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్ రుస్తోం-2ను డీఆర్‌డీవో శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. కర్ణాటకలోని చిత్రదుర్గలో జరిగిన ఈ పరీక్షలో 16వేల అడుగుల ఎత్తున 8 గంటల పాటు డ్రోన్ ప్రయాణించిందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది చివరికి 26వేల అడుగుల ఎత్తు, 18గంటల ప్రయాణ సామర్థ్యానికి చేరుకునేలా అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు. వివిధ రకాల పేలోడ్‌లను మోసుకెళ్లడం, సింథటిక్ అపెర్చర్ రాడార్, ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థ, పరిస్థితికి తగ్గట్టుగా స్పందించగలగడం రుస్తోం-2 ప్రత్యేకతలు. Read Also: పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యాంటీ రేడియేషన్ క్షిపణి‘రుద్రమ్’ను కూడా భారత్ శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. శత్రువుల నిఘా, రాడార్ వ్యవస్థలను నిర్వీర్యం చేసే సామర్థ్యంతో రూపొందించిన ఈ క్షిపణిని సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానం ద్వారా ప్రయోగించింది. మరోవైపు, ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన హెరోన్ డ్రోన్లను సాయుధ డ్రోన్లుగా మార్చేందుకు ఇజ్రాయెల్ ఏరోస్పేస్ సంస్థ(ఐఏఐ)తో భారత్ చర్చలు జరుపుతోంది. అమెరికాకు చెందిన ఎంక్యూ -9బీ సాయుధ డ్రోన్లను కూడా భారత్ కొనుగోలు చేయనుంది. Read Also: ఈ ఏడాది మే 5 నుంచి తూర్పు లడఖ్‌లో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. జూన్ 15 న గాల్వాన్ లోయ వద్ద జరిగిన ఘర్షణలో 21 మంది భారత జవాన్లు అమరులయ్యారు. సరిహద్దుల్లో నెలకున్న ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా ఇరు దేశాలూ అనేకసార్లు చర్చలు జరిపాయి. మరోసారి ఇరు సైన్యాలూ సోమవారం చర్చించనున్నాయి. ఇదిలా ఉండగా భారత సరిహద్దుల్లో చైనా 60వేల మంది సైనికులను మోహరించిందని అమెరికా బాంబు పేల్చింది.
By October 11, 2020 at 09:51AM
No comments