Breaking News

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి, 32 మంది గాయాలు


ఉత్తర్‌ ప్రదేశ్‌లో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఫిలిబిత్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పురాన్‌పూర్ వద్ద బొలేరో వాహానాన్ని బస్సు ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టాయి. దీంతో రెండు వాహనాల్లోని మొత్తం 39 మంది గాయపడ్డారు. వీరిలో ఏడుగురు మృతిచెందారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించిన పోలీసులు.. కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. అతివేగం, నిద్రమత్తు ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. మృతులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఎదురెదురుగా వచ్చిన బస్సు, బొలేరో వాహనం ఒకదానికొకటి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని ఫిలిబిత్ ఎస్పీ జయ ప్రకాశ్ తెలిపారు. ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, 32 మంది గాయపడ్డారని వివరించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని, పూర్తి వివరాలను తర్వాత వెల్లడిస్తామని పేర్కొన్నారు.


By October 17, 2020 at 08:16AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/more-than-seven-dead-after-a-bus-and-a-bolero-in-uttar-pradesh/articleshow/78713394.cms

No comments