Breaking News

YS Jagan క్రిస్టియన్.. డిక్లరేషన్ ఎందుకు ఇవ్వరు.. హిందువుల జోలికొస్తే ఊరుకోం: కరాటే కళ్యాణి సంచలన కామెంట్స్


ఇటీవల బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లిన సినీ, బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యారు. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యే వ్యాఖ్యలు చేశారు. తిరుమల డిక్లరేషన్ విషయంలో వైఎస్ జగన్‌ తప్పు చేశారంటూ తీవ్రంగా హెచ్చరించారు. ఆయన సీఎం.. కావొచ్చు పీఎం కావొచ్చు కాని.. తిరుమల రూల్స్‌ని బ్రేక్ చేసే హక్కులేదని.. ప్రశ్నించడం తన హక్కు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆమె మాట్లాడుతూ.. సీఎం జగన్ ముఖ్యమంత్రి కాబట్టి ఎవరూ ఆపరని తిరుమలకి వెళ్లారా?? ఆయన క్రిస్టియన్ అని అందరికీ తెలుసు.. మధ్యలో ఆయన హిందూమతం తీసుకున్నారని.. శారదా పీఠం దగ్గర గంగలో మునిగారు అని ఫొటోల్లో చూశాం కానీ.. నాకు తెలుసు మొదటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న రూల్‌ని బ్రేక్ చేయడం తప్పు. అది ఎవరైనా కావచ్చు.. సీఎం అవ్వొచ్చు.. పీఎం అవ్వచ్చు. డిక్లరేషన్ ఇచ్చి గుడిలోకి వెళ్లాలి కదా.. ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదు. ఆయన ఆంధ్రాకి సీఎం కావచ్చు.. అయితే నేను ఎలాగైనా దర్శనానికి వెళిపోతా అంటే కుదరదు కదా.. ఎవరికి వాళ్లు రూల్స్ పెట్టేసుకుంటే అంతకు ముందు వరకూ ఉన్న రూల్స్‌ని బ్రేక్ చేసినట్టే కదా. సీఎం జగన్ చేస్తున్నది తప్పు.. డిక్లరేషన్ ఇవ్వకుండా ఎలా వెళ్తారు.. వెళ్ల కూడదు. నాఇష్టం నేను వెళ్తా అంటే ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దాం అని.? మీరు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు కట్టుబడి ఉండాలి. అన్ని మతాలను గౌరవిస్తున్నప్పుడు ఇది కూడా గౌరవించాలి కదా. ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్నీ చదివారు. కాని ఆయన పట్టుకున్నది మాత్రం బైబిల్ మాత్రం. నిజానికి ఆయన మొదటి నుంచి క్రిస్టియన్ మతంలో ఉన్నట్టు అందరికీ తెలిసిందే. దాన్ని ఎవరూ కాదనలేం. కాని మీరు అన్యమతస్తులం అనో ఏదో ఒక డిక్లరేషన్ ఇచ్చి స్వామి వారి దర్శనానికి వెళ్తే గౌరవంగా చూస్తారు కదా.. ఎందుకంటే మీరు సీఎం కాబట్టి. కానీ నేను సీఎంని కదా.. గౌరవం ఇవ్వాలా అన్నట్టుగా వ్యవహరిస్తే.. అది ఆయనకే నష్టం. నేనైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా.. మీరు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చే వెళ్లాలని చెప్తా. ఆయన జెరూసలెం వెళ్తారు.. అక్కడ డిక్లరేషన్ ఇవ్వమంటే ఇస్తారు కదా.. మరి మా తిరుపతి అంటే.. దేవదేవుడు ఉన్న ప్రాంతం అది.. కళియుగ వైకుంఠాన్ని అంత ఇదిగా తీసేయాలా? మీరు ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదో ఆన్సర్ ఇవ్వండి. హిందువుల మనోభావాలను ఎందుకు దెబ్బతీశారు.. రెండు మూడురోజుల్లో నేను వీటన్నింటిపై స్పందిస్తా.. బీజేపీలో జాయిన్ అయిన తరువాత ఖచ్చితంగా నిలదీస్తా. గోవిందా.. గోవిందా.. అని కొన్ని కోట్ల మంది గోవిందుడ్ని కొలుస్తారు.. ఆ కోట్ల మందిలో మీకు ఓట్లు వేసిన వాళ్లు ఉన్నారు.. వాళ్ల మనోభావాల్ని ఎందుకు దెబ్బతీశారు. నియంతపాలన అని దేవుడి ముందు ప్రదర్శించకూడదు.. ముఖ్యమంత్రి పదవిలో ఉండి.. ఇలా చేయడం ఖచ్చితంగా తప్పు.. విగ్రహాలు ద్వంసం చేస్తున్నా పట్టించుకోవడంలేదు.. నేను దేవుడ్ని నమ్ముతా.. మీ దేవతలు, దేవుడుల జోలికి మేం రావడం లేదు.. మా దేవతలు, దేవుడుల జోలికి మీరు వస్తున్నారు.. అడగడంలో తప్పులేదు. మేం ఖచ్చితంగా అడుగుతాం.. ప్రశ్నిస్తాం.. మీరు వేరు చేస్తే.. మేం వేరు చేస్తాం’ అంటూ బీజేపీ పార్టీలో చేరకముందే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై సంచలన కామెంట్స్ చేసింది కరాటే కళ్యాణి.


By September 30, 2020 at 08:36AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/bigg-boss-fame-karate-kalyani-sensational-comments-on-ys-jagan-over-tirumala-declaration-issue/articleshow/78397700.cms

No comments