Breaking News

Renu Desai: అతను, అతని భార్య నన్నెలా ట్రీట్ చేశారంటే.. ఆ మూమెంట్స్ అస్సలు మరువను


పవన్ కళ్యాణ్ మాజీ భార్య చలాకీతనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. నటిగా, రచయితగా, దర్శకురాలిగా ప్రతి ఒక్కరికీ సుపరిచితం రేణూ. పవన్ నుంచి డివోర్స్ తీసుకున్నాక తన పిల్లలిద్దరితో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తున్న ఆమె నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక అంశంతో టచ్‌లోకి వస్తూనే ఉంది. కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉండి తిరిగి ఇప్పుడు మూవీస్ పరంగా యాక్టివ్ అవుతోంది. సమాజహితమైన కథలతో రెడీ అవుతోంది. ఈ క్రమంలో తాజాగా తాను రూపొందించనున్న కొత్త సినిమా కోసం రచయిత గోరేటి వెంకన్నను కలిసింది. ఆ అనుభవాలను పంచుకుంటూ ఆనంద క్షణాలను పంచుకుంది రేణూ దేశాయ్. Also Read: ఇష్క్ వాలా లవ్ సినిమాతో దర్శకురాలిగా మారిన రేణూ.. ప్రస్తుతం రైతు సమస్యలపై ఓ సినిమా రూపొందిస్తోంది. ఈ సినిమా పనుల్లో భాగంగా ఓ పాట కోసం రచయిత గోరేటి వెంకన్నను ఆయన ఫామ్ హౌస్‌లో మీట్ అయింది. ఈ మేరకు అనేక విషయాలపై చర్చించిన ఆమె.. వెంకన్న ఫ్యామిలీ తనపై చూపిన ప్రేమ ఆప్యాయతలకు పరవశించిపోయానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. ఆ మూమెంట్స్ అస్సలు మరువనంటూ మురిసిపోయింది. '' దంపతుల ఎంతో ప్రేమ, ఆత్మీయత.. పాటల కోసం గోరేటి వెంకన్నగారి ఫామ్ హౌస్‌‌కు వెళ్లాను. నా సినిమాకు ఆయన పాట రాయడాన్ని ఎంతో గౌరవంగా ఫీల్ అవుతున్నా. ఆయన భార్య నా కోసం మట్టి పాత్రల్లో ఎంతో రుచికరంగా అన్నం, పప్పు చేసి పెట్టింది. అరటి ఆకులో భోజనం పెట్టారు. రోటీ పచ్చడి సూపర్‌గా ఉంది. ఎంతో సాధారణ జీవితాన్ని గడుపుతున్న వారితో ఆదివారం రోజు మంచి అనుభూతి పొందాను'' అని పేర్కొంటూ అక్కడి వీడియోలను పోస్ట్ చేసింది రేణూ దేశాయ్.


By September 15, 2020 at 11:03AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/renu-desai-meets-goreti-venkanna-and-says-her-feelings/articleshow/78119811.cms

No comments