Breaking News

Rakul Drug​ Case: ‘రకుల్, మంచు లక్ష్మి పత్తిత్తు కబుర్లు’.. డ్రగ్స్ వ్యవహారంలో శ్రీరెడ్డి సంచలన వీడియో


బాలీవుడ్ నటుడు సుశాంత్ సూసైడ్ కేసు ఇన్వెస్టిగేషన్‌లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. బాలీవుడ్‌లో తీగ లాగితే టాలీవుడ్ డొంక కదులుతోంది. కేసు ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా సీబీఐతో పాటు ఈడీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) రంగంలోకి దిగి కీలక ఆధారాలు.. దీనిలో భాగంగా సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో లింక్ ఉన్న డ్రగ్స్ మాఫియా గుట్టు రట్టు అవుతోంది. డ్రగ్స్ వాడకం, సరఫరా ఆరోపణలతో సుశాంత్ మాజీ ప్రేయసి రియా చక్రవర్తిని కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తుండగా.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల ఇంటరాగేషన్‌లో డ్రగ్స్ మాఫియాతో సంబంధం ఉన్న సినీ ఇండస్ట్రీకి సంబంధించిన 25 మంది ప్రముఖుల పేర్లను బయటపెట్టినట్టుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. వీరిలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ పేరు ఉండటంతో టాలీవుడ్‌లో ప్రకంపనలు రేగుతున్నాయి. ఈ తరుణంలో రకుల్‌పై సంచలన కామెంట్స్ చేశారు వివాదాస్పద నటి . టాలీవుడ్‌లో అసలు క్యాస్టింగ్ కౌచ్ లేదని.. కొంతమంది పాపులారిటీ కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని.. డ్రగ్స్ కూడా లేదంటూ గతంలో రకుల్ చేసిన కామెంట్స్ గుర్తు చేస్తూ శ్రీరెడ్డి రెచ్చిపోయింది. డ్రగ్స్ ఇష్యూలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రకుల్ ప్రీత్ సింగ్‌‌కు కౌంటర్ ఇస్తూ ఫేస్ బుక్‌లో వీడియో విడుదల చేసింది శ్రీరెడ్డి. ‘ఇది రివేంట్ అని నేను అనుకోవడం లేదు.. గతంలో నేను క్యాస్టింగ్ కౌచ్‌పై ఉద్యమం చేస్తున్నప్పుడు .. టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ కాని, డ్రగ్స్ లాంటివి ఏమీ ఉండవు.. మా ఆర్టిస్ట్‌లను లం*** అంటారా? అంటూ సోది చెప్పింది. మంచు లక్ష్మి అయితే టాలీవుడ్ డ్రగ్స్ ఆరోపణలకు నిరసనగా.. క్యాండిల్స్ వెలిగించి మా ఇండస్ట్రీలోనే డ్రగ్స్ వాడతారా? మా ఇండస్ట్రీలోనే క్యాస్టింగ్ కౌచ్ ఉందా? అంటూ సిగ్గు లేకుండా మాట్లాడారు. ఈరోజు డ్రగ్స్ తీసుకున్నట్లుగా రకుల్ ప్రీత్ సింగ్‌పై వార్తలు వస్తున్నాయి. ఆ రోజు క్యాస్టింగ్ కౌచ్ లేదండీ.. అదండీ.. ఇందండీ.. టాలీవుడ్ సూపర్ అండీ.. డూపర్ అండీ.. డ్రగ్స్ అంటే ఏంటో తెలియడండీ అంటూ పత్తిత్తు కబుర్లు చెప్పింది. ఈరోజు ముంబై వెళ్లి.. క్యాస్టింగ్ కౌచ్ ఉండకూడదు.. ఇక్కడ బాగా ఉంది అని పబ్లిసిటీకి నోటికొచ్చినట్టు మాట్లాడుతోంది. అక్కడ మైక్‌ల ముందు ఒకలా మాట్లాడుతోంది. ఇక్కడ మైక్‌ల ముందు ఒకలా మాట్లాడుతోంది. బాలీవుడ్‌లో మాట్లాడితే టాలీవుడ్‌కి తెలియదని అనుకుంటుందో ఏమో కాని.. మొత్తానికి డ్రగ్స్ కేసులో ఆమె పేరు బయటపడింది. ఆరోజు ఎవరైతే నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడి.. పత్తిత్తుల్లా బిహేవ్ చేశారో.. ఈరోజు అందరి రంకు పురాణాలు, చెత్త యవ్వారాలు, అసాంఘిక కార్యక్రమాలు బయటకు వస్తున్నాయి. నాకు చెడ్డ పేరు వస్తే వచ్చింది.. వాటిని మోసాను.. ఇప్పటికైనా కళ్లు తెరుచుకోండి. నన్ను నిందించిన వాళ్లు పాపం అనుభవిస్తున్నారు. పాపం ఊరికే వదలదు.. పట్టి కుదిపేస్తాది.. దాన్నే మనం కర్మ అంటాం.. ఈరోజు ఆ కర్మ అనుభవిస్తున్నారు. దానికి ఉన్నోళ్లు లేనోళ్లు అందగత్తెలు అనే బేధం ఉండదు. అందరి తాట తీస్తుంది’ అంటూ రకుల్‌కి గట్టి కౌంటర్ ఇచ్చింది శ్రీరెడ్డి.


By September 13, 2020 at 01:08PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-sri-reddy-strong-counter-to-rakul-preet-singh-and-manchu-lakshmi-over-tollywood-drug-racket/articleshow/78087441.cms

No comments