Breaking News

Kamal Haasan: ఒకానొక సమయంలో అక్కడో దెయ్యం నివసించింది.. స్టార్ హీరో ఫిక్సయ్యారిలా!


విలక్షణ నటుడు మరో ఆసక్తికర కథాంశాన్ని ఓకే చేశారు. ఇటీవలే 'ఖైదీ' సినిమాతో తెలుగు, తమిళ భాషల్లో భారీ హిట్ ఖాతాలో వేసుకున్న దర్శకత్వంలో ఆయన కొత్త సినిమా రాబోతోంది. ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన దర్శకనిర్మాతలు ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేసి ఆసక్తి రేకెత్తించారు. ఇది కమల్ హాసన్ నటిస్తున్న 232వ సినిమా అంటూ అట్రాక్ట్ చేశారు. ''ఒకానొక సమయంలో అక్కడ ఓ దెయ్యం నివసించింది'' అని పేర్కొంటూ కేవలం తుపాకులతో హీరో కమల్ హాసన్ రూపాన్ని ప్రేక్షకుల ముందుంచారు. చూడటానికి ఎంతో డిఫరెంట్‌గా ఉన్న ఈ పోస్టర్, దానిపై రాసి ఉన్న ఆ దెయ్యం కోట్ సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ మూవీ షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. త్వరత్వరగా షూటింగ్ ఫినిష్ చేసి 2021 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. Also Read: కమల్ హాసన్‌‌కి చెందిన రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందించనున్నారు. తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ సినిమా చాలా డిఫరెంట్‌గా ఉండనుందని చెప్పేసింది. అతిత్వరలో ఈ మూవీ ఇతర నటీనటుల వివరాలు ప్రకటించనుంది చిత్రయూనిట్. మరోవైపు శంకర్ దర్శకత్వంలో 'భారతీయుడు 2' మూవీ చేస్తున్నారు కమల్ హాసన్.


By September 17, 2020 at 08:35AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/kamal-haasan-new-movie-announced-which-is-directed-by-lokesh-kanagaraj/articleshow/78159135.cms

No comments