రాధేశ్యామ్: పూజా హెగ్డే రెండు పాత్రల్లో..?
సాహో తర్వాత నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రాధేశ్యామ్. పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైన సంగతి తెలిసిందే. 1970ప్రాంతంలో యూరప్ లో సాగే ప్రేమకథగా ఈ చిత్రాన్ని మలుస్తున్నారట. యాభైశాతం షూటింగ్ యూరప్ లోనే చేయాల్సి ఉందట. కరోనా లేకపోయుంటే ఈ పాటికి చిత్ర షూటింగ్ పూర్తయ్యి ఉండేదేమో.
ప్రస్తుతం హైదరాబాద్ లో సెట్ వేసి షూటింగ్ చేద్దామని ప్లాన్ వేస్తున్నారు. ఐతే రాధేశ్యామ్ సినిమాలోపూజా హెగ్డే పాత్రపై ఒకానొక వార్త బయటపడింది. క్లాసికల్ డాన్సర్ గా పూజా హెగ్డే కనిపిస్తుందని, సాంప్రదాయ పద్దతిలో పూజా హెగ్డే లుక్ అదిరిపోతుందని వినబడింది. ఐతే రాధే శ్యామ్ లో పూజా హెగ్డే డ్యుయల్ రోల్ లో కనిపించనుందట. ఈ మేరకు అధికారిక సమాచారం రానప్పటికీ ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఒక పాత్రలో డాన్సర్ గా కనిపిస్తే, మరో పాత్రలో ఎలా కనిపించనుందనే ఆసక్తి మొదలైంది. మరి పూజా హెగ్డే నిజంగా డ్యుయల్ రోల్ లో కనిపించనుందా లేదా అనేది తెలియాలంటే చిత్రబృందం స్పందించాల్సిందే. గోపీక్రిష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ అక్టోబర్ రెండవ వారంలో రీస్టార్ట్ అవనుంది.
By September 29, 2020 at 12:24AM
No comments