కలికాలమంటే ఇదేనేమో!! తాగొచ్చి చితక్కొడుతున్న భార్య.. వేడుకుంటున్న భర్త

మందు తాగొచ్చి భార్యలను కొడుతున్న మొగుళ్లను లక్షల మందిని చూసుంటాం. పాపం.. భర్త భరించలేకపోయినా చాలా మంది మహిళలు ఓర్పుతో సర్దుకుపోతుంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. భర్తని భార్య చితక్కొడుతోంది. అదీ ఫుల్లుగా మందుతాగి. తన భార్య తాగొచ్చి కొడుతోందని.. తనకు, తన తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను వేడుకున్నాడు భర్త. ఈ షాకింగ్ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగింది. నగరంలోని మణినగర్ ఏరియాకి చెందిన యువకుడు(29) ఓ యువతితో రిలేషన్‌షిప్ అనంతరం 2018 మార్చిలో వివాహం చేసుకున్నాడు. పెళ్లికి ముందు వరకు బాగానే ఉన్న యువతి వివాహానంతరం చుక్కలు చూపించడం మొదలుపెట్టింది. మందు తాగి నానారభస చేసేది. తాగొచ్చి భర్తని కొట్టడం మొదలుపెట్టింది. తాను ఇంట్లో ఏకాంతంగా ఉండాలని.. అత్తమామలను వెళ్లగొట్టాలని భర్తపై ఒత్తిడి చేసింది. భర్త, అత్తమామలను కింద ఫ్లోర్‌లో ఉంచి తాను ఫస్ట్‌ఫ్లోర్‌కి షిఫ్ట్ అయింది. అప్పటి నుంచి ఇల్లు తన పేరుమీద రాయాలంటూ వేధింపులకు దిగింది. Also Read: అత్తమామలకు కరోనా సోకి తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కనీసం పట్టించుకోలేదు. వారి బాగోగులు చూసుకోలేదు. నిలదీస్తే వెంటనే మహిళా హెల్ప్‌లైన్‌కి ఫోన్ చేసి వేధిస్తున్నామంటూ ఆరోపణలు చేస్తోంది. తన భార్య తనను, తన తల్లిదండ్రులను మానసికంగా, శారీరకంగా హింసిస్తోందంటూ భర్త పోలీసులను ఆశ్రయించాడు. ఆమె తాగొచ్చి కొడుతోందని.. తమకురక్షణ కల్పించాలని కోరాడు. ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు దర్యాప్తు జరిపి అవసరమైతే రక్షణ కల్పిస్తామని చెప్పారు. Read Also:
By September 19, 2020 at 09:30AM
No comments