Breaking News

హీరోల వల్లే కాలేదు.. కరోనా టైంలో అనుష్క అరుదైన రికార్డ్


శెట్టి, మాధవన్ నటించిన ‘నిశ్శబ్దం’ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో అక్టోబర్ 2 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానుంది. ఒక ఓటీటీ ప్లాట్‌ఫాంలో డైరెక్ట్‌గా విడుదలవుతోన్న తొలి త్రిభాషా చిత్రం ‘నిశ్శబ్దం’. ఇప్పటి వరకు ఏ హీరో సినిమా కూడా ఈ విధంగా మూడు భాషల్లో ఒకేసారి నేరుగా ఓటీటీలో విడుదలకాలేదు. ఈ అరుదైన రికార్డును స్వీటీ తన ఖాతాలో వేసుకున్నారు. కాగా, ఇటీవల విడుదలైన ‘నిశ్శబ్దం’ ట్రైలర్‌కు అనూహ్య స్పందన వచ్చింది. ట్రైలర్‌కు వచ్చిన స్పందనపై చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉంది. సినిమాను కచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశాభావంతో ఉంది. ఈ సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. క్రితి ప్రసాద్ స‌మ‌ర్పణ‌లో కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ అసోసియేషన్‌తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపీ సుందర్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా చిత్రీకరణ చాలా వరకు అమెరికాలోనే జరిగింది. ‘నిశ్శబ్దం’లో అనుష్క, మాధవన్‌తో పాటు అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రం ద్వారా హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడ్సెన్ ఇండియన్ సినిమాకు పరిచయమవుతున్నారు. వినికిడి లోపంతో పాటు, మాట్లాడలేని అమ్మాయి పాత్రలో అనుష్క నటించారు. ఆ పాత్ర పేరు సాక్షి. ఆమె ఒక పెయింటర్. తన భర్తతో కలిసి ఒక విల్లాకు వెళ్లినప్పుడు అక్కడ అనుకోకుండా ఒక సంఘటన జరుగుతుంది. ఆ క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌లో సాక్షి చిక్కుకుంటుంది. ఎన్నో మలుపులతో కూడిన ఈ కేస్ ఇన్వెస్టిగేషన్ ప్రేక్షకులకు మంచి థ్రిల్‌ను ఇస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. Also Read:


By September 23, 2020 at 11:38AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/anushka-shettys-nishabdham-is-the-first-tri-lingual-film-releasing-on-ott/articleshow/78269970.cms

No comments