Breaking News

కశ్మీరీ ప్రజలు తాము భారతీయులమని భావించడంలేదు.. ఫరూక్ అబ్దుల్లా


జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫెరెన్స్ అధినేత ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కశ్మీరీలు భారతీయులమని భావించడంలేదు.. భారతీయులుగా ఉండాలని కోరుకోవడంలేదని వ్యాఖ్యానించారు. కశ్మీర్ ప్రజల మనోగతంపై యాంకర్, జర్నలిస్ట్ కరన్ థాపర్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ.. నిజం చెప్పాలంటే, కశ్మీర్‌లో భారతీయుడు అని పిలిచే వ్యక్తిని కనుగొంటే ఆశ్చర్యపోతున్నాను ... కావాలంటే మీరు వెళ్లి తెలుసుకుని వారితో మాట్లాడండి.. తాము పాకిస్థానీలమని చెప్పరు, కానీ, ఇదే సమయంలో భారతీయులమనే భావన లేదు.. ఇలా ఉంటే మనం బతకగలమా అనే ఆందోళన కలుగుతుంది అని అన్నారు. కశ్మీరీలు ప్రభుత్వాన్ని ఇకపై నమ్మరు... ఇది లోయలోని ప్రజల మనోగతం.. దేశ విభజన సమయంలో పాక్ వెంట వెళ్లడం కశ్మీరీలకు చాలా సులభం కానీ, గాంధీ భారతదేశంలో చేరారు, మోడీ భారత్‌లో కాదు అని పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే రద్దు తర్వాత నిర్బంధంలో ఉన్న ఫరూక్ అబ్దుల్లా ఇటీవలే విడుదలయ్యారు. అయితే, ఫరూక్, మొహబూబా ముఫ్తీలు లోయలో గందరగోళంపై ఆధారపడతారు. ‘మరోవైపు చైనా ముందుకు సాగుతోంది.. కశ్మీరీలతో మాట్లాడితే వారిలోని చైనీయులు బయటపడతారు.. ఏది ఏమైనప్పటికీ తమ ప్రాంతంలోని ముస్లింలకు చైనీయులు ఏమి చేశారో తెలుసు.. దీనిని తీవ్రంగా పరిగణించను.. కానీ ఈ విషయంలో నిజాయితీగా ఉన్నాను. ప్రజలు వినడానికి ఇష్టపడని వాటిని నేను నిజాయితీగా మీకు చెబుతున్నాను. పాకిస్థాన్‌ వెంట వెళ్లేందుకు ఇష్టపడటంలేదు’ అని అన్నారు.


By September 24, 2020 at 11:07AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/kashmiri-peopel-dont-feel-theyre-indian-says-farooq-abdullah/articleshow/78289787.cms

No comments