Breaking News

అత్యంత శక్తివంతమైన లేజర్ ఆయుధాల తయారీకీ డీఆర్డీఓ సన్నాహాలు


జాతీయ ఇంధన ఆయుధాల తయారీ పోగ్రామ్‌లో భాగంగా శక్తివంతమైన లేజర్‌లు, అధిక శక్తితో కూడిన మైక్రోవేవ్‌లు వంటి ఆయుధాల రూపకల్పనకు రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ () ప్రణాళికలు రచిస్తోంది. భవిష్యత్తులో ఇవి ప్రపంచానికి కీలకమైన ఆయుధాలుగా మారుతాయని భావిస్తోంది. జాతీయ పోగ్రామ్‌లో స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలు ఉంటాయి.. చివరికి దేశీయంగా 100 కిలోవాట్ల సామర్థ్యంతో కూడిన ఆయుధాలను అభివృద్ధి చేయడమే దీని లక్ష్యమని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. శత్రువుల క్షిపణులు, యుద్ధ విమానాలను సులభంగా అడ్డుకునే ‘కెమికల్ ఆక్సిజన్ అయోడిన్’ ‘హై-పవర్ ఫైబర్’ లేజర్ల నుంచి రహస్య లేజర్‌తో నడిచే కాళీ వంటి ఆయుధం వరకు ఎనర్జీ సాయంతో పనిచేసే అనేక ఆయుధాల తయారీ ప్రాజెక్టులపై డీఆర్డీఓ పనిచేస్తోంది. కానీ ప్రస్తుతం అవి ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం తూర్పు లడఖ్‌లో చైనాతో కొనసాగుతున్న సైనిక ఘర్షణల మధ్య డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ ()పై డీఆర్డీఓ దృష్టి సారించింది. ఇప్పటివరకు రెండు యాంటీ-డ్రోన్ డీఈడబ్ల్యూ వ్యవస్థలను అభివృద్ధి చేసిన డీఆర్డీఓ... ప్రస్తుతం వీటిని పెద్ద సంఖ్యలో ఉత్పత్తిచేయాలని భావిస్తోంది. రెండు కిలోమీటర్ల పరిధిలో వైమానిక లక్ష్యాలను ఛేదించడానికి 10 కిలోవాట్ల లేజర్‌ సామర్థ్యంతో పనిచేసే ట్రైలర్ మౌంటెడ్ డ్రోన్, కిలోమీటరు పరిధిలోని శత్రువుల లక్ష్యాలను చేరుకునే రెండు కిలోవాట్ల లేజర్‌ కాంపాక్ట్ ట్రైపాడ్-మౌంటెడ్‌ను డీఆర్డీఓ రూపొందించింది. సాయుధ దళాలు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, పోలీసులకు క్షేత్రస్థాయిలో ఈ మైక్రో డ్రోన్‌లు ఉపయోగపడతాయని, కమాండ్ కంట్రోల్ వ్యవస్థ లేదా లేజర్ ఎలక్ట్రానిక్‌ విధానం ద్వారా శత్రువుల కదలికలను గమనించి, దెబ్బతీయగలవని అధికారులు తెలిపారు. డ్రోన్లు, వాహనాలు, పడవలను ధ్వంసం చేయడానికి అమెరికా, రష్యా, చైనా, జర్మనీ, ఇజ్రాయేల్ వంటి దేశాలు అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన డీఈడబ్ల్యూలతో పోలిస్తే ఈ స్వదేశీ వ్యవస్థలు చాలా ఉత్తమైనవని వివరించారు. ఉదాహరణకు, అమెరికాలో చాలా ఏళ్ల కిందటే డ్రోన్లను కూల్చడానికి ఒక యుద్ధనౌక నుంచి 33 కిలోవాట్ల లేజర్ ఆయుధాన్ని పరీక్షించింది. అంతేకాదు, యుద్ధ విమానాన్ని గాలిలో కూల్చివేసే ‘హై-ఎనర్జీ సాలిడ్-స్టేట్ లేజర్’ను ఈ ఏడాది మేలో పరీక్షించింది. వాస్తవానికి, క్రూయిజ్ క్షిపణులను కూల్చివేసే 300 నుంచి 500 కిలోవాట్ల సామర్థ్యం గల డీయూలు అమెరికాకు అందుబాటులోకి రావడానికి కేవలం నాలుగైదేళ్లు పడుతుంది.


By September 14, 2020 at 01:41PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/defence-reasearch-and-development-orgnization-plans-star-wars-style-weapons-for-battles-of-future/articleshow/78102581.cms

No comments