పెద్దకొడుకు దగ్గరికెళ్దామనుకున్న తల్లి.. చంపేసిన చిన్నకొడుకు.. గుంటూరులో ఘోరం

మానవ సంబంధాలన్నీ మనీ బంధాలుగా మారిపోతున్నాయి. డబ్బులు కోసమో.. ఆస్తుల కోసమో అయినవాళ్లను అంతమొందించేందుకు కూడా వెనకాడడం లేదు కొందరు కిరాతకులు. కాసుల కోసం కాటికి కాళ్లు చాచిన తల్లిదండ్రలను కూడా చంపేస్తున్న అమానవీయ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏపీలోని జిల్లాలో తాజాగా అలాంటి దారుణ ఘటన వెలుగుచూసింది. అన్న దగ్గరికెళ్తే తనకు ఆస్తి దక్కదని భావించిన తమ్ముడు ఏకంగా కన్నతల్లినే మట్టుబెట్టాడు. ఈ అమానుష ఘటన రొంపిచర్ల మండలం అన్నవరంలో జరిగింది. గ్రామానికి చెందిన కుందేటి తిరుపతమ్మ(85) ఇద్దరు కొడుకులు ఆంజనేయులు, ఏడుకొండలు. ఆమె భర్త వెంకయ్య 20 ఏళ్ల కిందట మరణించడంతో చిన్నకొడుకు వద్దే ఉంటోంది. వృద్ధాప్యంలో తన బాగోగులు చూసుకునే వారికి ఆమె పేరిట ఉన్న నాలుగెకరాల భూమిలో ఎకరం అదనంగా ఇచ్చేట్టు గ్రామపెద్దల సమక్షంలో ఒప్పందం జరిగింది. అయితే ఇటీవల అనూహ్యంగా పెద్దకొడుకు ఆంజనేయులు భార్య మరణించింది. చిన్నకొడుకు తనను కొంత నిర్లక్ష్యం చేస్తుండడం.. పెద్దకొడుకు భార్య కూడా చనిపోవడంతో అతని ఇంటికి వెళ్లాలని అనుకుంది. Also Read: ఆ విషయం తెలిసిన చిన్నకొడుకు ఏడుకొండలు ఆగ్రహంతో రగిలిపోయాడు. తల్లి ఇప్పుడు పెద్దకొడుకు ఇంటికి వెళ్తే తనకు అదనంగా రావాల్సిన ఎకరం భూమి పోతుందని కోపం పెంచుకున్నాడు. అదే విషయమై ఆమెతో తరచూ గొడవపడుతున్నాడు. మద్యం మత్తులో ఇంటికొచ్చిన ఏడుకొండలు కన్నతల్లి అనే కనీస కనికరం లేకుండా కర్రతో విచక్షణా రహితంగా కొట్టడంతో ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న రొంపిచర్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి నిందితుడు ఏడుకొండలును అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Read Also:
By September 13, 2020 at 10:40AM
No comments