Breaking News

సిలబస్‌లో ఎన్టీఆర్ చరిత్ర.. కేసీఆర్‌కు లేఖ రాసిన నందమూరి ఫ్యామిలీ


తెలంగాణలోని పాఠశాల సిలబస్‌లో ఎన్టీఆర్ జీవిత చరిత్రను చేర్చడంపై నందమూరి కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన మంత్రివర్గ సహచరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు నందమూరి కుటుంబం పేరుతో ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. Also Read: ‘మా తండ్రిగారైన నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్రను తెలంగాణ రాష్ట్ర స్కూల్ సిలబస్‌లో చేర్చడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మేమే కాదు.. యావత్ తెలుగు ప్రజలు మీ నిర్ణయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహనీయుడి జీవిత చరిత్రను తెలంగాణ పాఠశాల సిలబస్‌లో చేర్చడం భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది. ఆయనలోని నీతి, నిజాయితీ, కృషి, క్రమశిక్షణ, నిబద్ధత.. వీటన్నింటినీ ఆదర్శంగా తీసుకుంటే ప్రతి విద్యార్థి భవిష్యత్తులో ఉత్తమ పౌరుడిగా తయారవుతాడని భావిస్తున్నాం. ఎన్టీఆర్ జీవితాన్ని సిలబస్‌లో చేర్చినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాం’ అంటూ నందమూరి రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. Also Read:


By September 10, 2020 at 12:08PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nandamuri-family-thanks-telangana-cm-kcr/articleshow/78033476.cms

No comments