ఇంటి చూరి నుంచి పడి.. ఇల్లాలి నుదిటిపై కాటేసిన పాము.. పశ్చిమ గోదావరిలో విషాదం


విషసర్పం రూపంలో విధి కాటేసింది. నట్టింట్లో మృత్యువు ముంచుకొచ్చింది. ఇంటి చూరి నుంచి కిందపడిన పాము ఆ ఇల్లాలిని బలి తీసుకుంది. ఇల్లు తుడుచుకుంటున్న వివాహిత పాముకాటుకు గురై ప్రాణాలు విడిచింది. ఈ అత్యంత విషాద ఘటన జిల్లాలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ షాకింగ్ ఘటన వివరాలు.. నియోజకవర్గం పెంటపాడు మండలంలోని రావిపాడులో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొరిమి నాగలక్ష్మి(24) రోజు మాదిరిగానే ఇంటి పనుల్లో నిమగ్నమైంది. ఇల్లు తుడుచుకుంటుండగా ఇంటి చూరి నుంచి పాము కిందపడింది. ఆమె తేరుకునేలోపే నాగలక్ష్మి నుదిటిపై కాటు వేసింది. ఊహించని ఘటనతో బాధితురాలు షాక్‌కి గురైంది. Also Read: కుటుంబ సభ్యులు గమనించి వెంటనే తణుకులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూ నాగలక్ష్మి ఆస్పత్రిలో ప్రాణాలు విడిచింది. భర్త మురళి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. Read Also:
By September 30, 2020 at 10:32AM
No comments