Breaking News

అమ్రపాలికి అరుదైన అవకాశం.. పీఎంఓలో నియామకం


ఐఏఎస అధికారిణి అమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభిచింది. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ కార్యాలయం డిప్యూటీ సెక్రటరీగా ఆమె నియమితులయ్యారు. పీఎంవోలో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె కూడా స్థానం దక్కించుకున్నారు. పీఎంవో కార్యాలయంలో కొత్తగా ముగ్గురు ఐఏఎస్ అధికారులు నియమితులయ్యారు. ఈ మేరకు కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా నియమితులైన ఐఏఎస్ అధికారుల్లో మధ్యప్రదేశ్ 2004 కేడర్‌కి చెందిన రఘురాజ్ రాజేంద్రన్,ఆంధ్రప్రదేశ్ 2010 కేడర్‌కు చెందిన కాట,ఉత్తరాఖండ్ 2012 కేడర్‌కి చెందిన మంగేష్ గిల్దియాల్ ఉన్నారు. ఐఏఎస్ రఘురాజ్ రాజేంద్రన్‌ పీఎంవో కార్యాలయ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఇంతకుముందు ఆయన స్టీల్,పెట్రోలియం,సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ప్రైవేట్ సెక్రటరీగా సేవలందించారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ మంగేష్ గిల్దియాల్ తాజాగా పీఎంవో అండర్ సెక్రటరీగా నియమితులయ్యారు. మరో ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా పీఎంవో డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు. ఇక అంతకుముందు అమ్రపాలి వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా విధులు చేపట్టారు. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. వరంగల్ కలెక్టర్‌గా ఉన్న సమయంలో ఆమె చాలా మంచి పేరు ప్రఖ్యాతలతో పాటు అనేకమంది అభిమానుల్ని కూడా సంపాదించుకున్నారు.


By September 13, 2020 at 07:41AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/ias-officer-amrapali-kati-appointed-as-deputy-secretary-in-pmo/articleshow/78084895.cms

No comments