Breaking News

బర్త్‌డే పార్టీకెళ్లి స్విమ్మింగ్ పూల్‌లో శవమైన ఫ్రెండ్.. విశాఖలో మిస్టరీగా మరణం


పుట్టినరోజు వేడుకలు ఓ ఇంట విషాదాన్ని మిగిల్చాయి. టీనేజ్ యువకుడు స్విమ్మింగ్ పూల్‌లో పడి చనిపోవడంపై దుమారం రేగుతోంది. పూల్‌లో పడిపోయి చనిపోయాడని స్నేహితులు చెబుతుంటే.. ఫ్రెండ్సే చంపేసి పడేశారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో పదో తరగతి విద్యార్థి మరణం మిస్టరీగా మారింది. ఈ విషాద ఘటన విశాఖపట్నంలో జరిగింది. నగరంలోని గాజువాక ప్రాంతానికి చెందిన సుధాకర్ పుట్టినరోజు సందర్భంగా నిన్న అచ్యుతాపురం మండలం కొండకర్ల వద్ద గల ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో వేడుకలు నిర్వహించారు. అతి కొద్దిమంది స్నేహితులనే సుధాకర్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. పది మంది వరకూ స్నేహితులు పార్టీకి వచ్చారు. గాజువాక బీసీ కాలనీకి చెందిన పదో తరగతి విద్యార్థి సాయి కూడా వేడుకలకు హాజరయ్యాడు. పార్టీ అయిపోయిన తర్వాత షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. Also Read: అనూహ్యంగా రిసార్ట్‌లోని స్విమ్మింగ్‌పూల్‌లో సాయి శవమై తేలాడు. పూల్‌లో పడిపోయి ఊపిరాడక చనిపోయాడని అతని స్నేహితులు చెబుతున్నారు. అయితే స్నేహితులే చంపేసి పూల్‌లో పడేసి ఉంటారని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో విద్యార్థి మరణం మిస్టరీగా మారింది. తల్లిదండ్రులు చనిపోవడంతో సాయి బంధువుల ఇంట ఉండి చదువుకుంటున్నట్లు తెలుస్తోంది. సడెన్‌గా బాలుడి మరణంతో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. Read Also:


By September 19, 2020 at 01:11PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/teenager-suspicious-death-in-swimming-pool-in-visakhapatnam/articleshow/78201382.cms

No comments