Breaking News

దేశంలో నాలుగు మిలియన్లు దాటిన కరోనా బాధితులు


వరుసగా మూడో రోజు 80వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదుకావడం దేశంలో కరోనా ఉధృతికి అద్దం పడుతోంది. దీంతోపాటు మరణాలు కూడా పెద్ద సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి. గడచిన 24 గంటల్లో 86,432 మంది కొత్తగా వైరస్ నిర్ధారణ కాగా... మొత్తం కేసుల సంఖ్య 40, 23,179కి చేరింది. అలాగే, మరో 1,089 మంది కోవిడ్-19తో మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాలు 69,561కి చేరాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి 31,07,222 మంది దేశవ్యాప్తంగా కోలుకున్నారు. ప్రస్తుతం 8,46,395 యాక్టివ్ కేసులు దేశంలో ఉన్నాయి. మహారాష్ట్రలో రికార్డుస్థాయిలో 19,218 కొత్త కేసులు శుక్రవారం వెలుగచూడగా.. మరో 350 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ముంబయిలో మరోసారి దాదాపు 2వేల మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. ముంబయి నగరంలో జూన్ 27 తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఆంధ్రప్రదేశ్‌లో మరో 10,770 కొత్త కేసులు నమోదయ్యాయి. తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలు నిలిచాయి. అయితే, ఆగస్టు 13-19 మధ్య వారంతో పోలిస్తే ఆగస్టు 27-సెప్టెంబరు 2 మధ్య వారంలో పలు రాష్ట్రాల్లో రోజువారీ యాక్టివ్‌ కేసుల్లో తగ్గుదల కనిపించినట్లు కేంద్రం వివరించింది. ఈ తగ్గుదల తమిళనాడులో అత్యధికంగా 24 శాతం ఉందని తెలిపింది. కాగా.. శుక్రవారం రాత్రి నాటికి దేశంలో కోవిడ్ బాధితుల సంఖ్య 40 లక్షలు దాటింది. రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌కు అతి సమీపంలో ఉంది. ఇక దేశవ్యాప్తంగా రికవరీ రేటు 77.23 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.73 శాతంగా ఉంది. అయితే, దేశం మొత్తం మీద క్రియాశీలక కేసుల సంఖ్య 15,271 మేర పెరిగింది. నిన్నటితో పోలిస్తే ఇది తగ్గడం గమనార్హం. క్రియాశీలక కేసుల పెరుగుదలలోనూ మహారాష్ట్రదే తొలిస్థానం. ఇక దేశరాజధాని దిల్లీలో కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. శుక్రవారం 2,194 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. గత 69 రోజుల్లో ఇవే అత్యధిక కేసులు.


By September 05, 2020 at 11:11AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/indias-coronavirus-tally-crosses-40-lakh-with-single-day-spike-of-86432-new-cases/articleshow/77944298.cms

No comments