అన్నని కొట్టి చంపిన చెల్లెలు.. గుంటూరులో దారుణం


తోడబుట్టిన అన్నని సొంత చెల్లెలే దారుణంగా కొట్టి చంపేసిన అమానుష ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. నిత్యం తాగొచ్చి తల్లిని, చెల్లిని వేధిస్తుండడంతో భరించలేక ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఫిరంగిపురం మండలం కండ్రికలో ఈ ఘటన జరిగింది. మద్యానికి బానిసైన అన్న రోజూ తాగొచ్చి వేధిస్తుండడంతో చెల్లెలు దారుణానికి ఒడిగట్టింది. మరోమారు తల్లితో గొడవపడడంతో రోకలిబండతో అన్న తలపై బలంగా కొట్టింది. తీవ్రంగా గాయపడిన అన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Also Read:
By September 20, 2020 at 03:41PM
No comments