Breaking News

రైతుగా మారినందుకు ఆర్నెల్లకే ఆత్మహత్య.! అన్నదాత ఆక్రందన కళ్లకు కడుతున్న విషాద ఘటన


లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి పోవడంతో తన పొలంలో వ్యవసాయం మొదలుపెట్టిన రైతు అనూహ్యంగా ఆత్మహత్య చేసుకున్నాడు. సాగు కోసం తెచ్చిన అప్పులు కుప్పలుగా పెరిగిపోవడం.. మరోవైపు ఆశించిన ఆదాయం (గిట్టుబాటు ధరలు) రాకపోవడంతో అప్పులు చెల్లించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. లాక్‌డౌన్ పూర్తయినా కాలేదు ఈ లోకం నుంచి వెళ్లిపోయాడు. వ్యవసాయం చేస్తున్న రైతన్న ఇబ్బందులను.. అన్నదాత ఆక్రందనను కళ్లకు కడుతున్న ఈ అత్యంత విషాద ఘటన చిత్తూరులో చోటుచేసుకుంది. చనిపోయే ముందు అల్లుడి పేరుతో మామ రాసిన సూసైడ్ నోట్ స్థానికులను కలచివేస్తోంది. కురబలకోట మండలం ముదివేడు పంచాయతీ దాదంవారిపల్లెకి చెందిన అమరనాథరెడ్డి(50) మదనపల్లెలోని ఓ మద్యం దుకాణంలో పనిచేసేవాడు. లాక్‌డౌన్ కారణంగా దుకాణం మూతుపడడంతో ఉపాధి లేకుండా పోయింది. స్వగ్రామానికే వచ్చేసిన అమరనాథ రెడ్డి.. తన ఆరెకరాల పొలంలో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా పొలంలో రెండు బోర్లు వేయించాడు. అందులో ఒక బోరులోనే నీరు పడింది. మరోటి వృథా అయింది. అయినా సాహసం చేసి సాగు చేపట్టాడు. పొలంలో టమోటా, వరి, అల్లనేరేడు పంటలు సాగు చేశాడు. బోర్లు, సాగు ఖర్చుల కోసం సుమారు రూ.8 లక్షల మేర అప్పు చేశాడు. పంటమీద వచ్చే ఆదాయంతో అప్పులు తీర్చేద్దామనుకున్నాడు. తీరా పంట చేతికొచ్చే సమయానికి ఆశించిన ఆదాయం కనిపించలేదు. గిట్టుబాటు ధరలు లేకపోవడంతో పెట్టుబడి కూడా చేతికొచ్చే పరిస్థితి కనిపించలేదు. వడ్డీలతో కొండలా పెరిగిపోయిన అప్పులకు తోడు రుణదాతల ఒత్తిళ్లు.. .. గిట్టుబాటు ధర లేని పంటలతో ఏంచేయాలో పాలుపోక దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయాడు. Also Read: అప్పులు చెల్లించే మార్గం కనిపించక ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంట్లో అందరూ నిద్రపోయిన తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు కష్టాల్లో తన అల్లుడి సాయాన్ని గుర్తు చేసుకుంటూ సూసైడ్ నోట్ రాసి కంటతడి పెట్టించాడు. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని.. తన అల్లుడు ఎంతో సాయం చేశాడంటూ సూసైట్ నోట్ రాసి ప్రాణాలు తీసుకున్నాడు. ఉదయాన్నే అపస్మారక స్థితిలో ఉన్న అమరనాథరెడ్డిని గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ప్రాణాలు వదిలేశాడు. Read Also:


By September 18, 2020 at 01:25PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/farmer-turned-private-employee-commits-suicide-in-chittoor/articleshow/78183845.cms

No comments