Breaking News

సెల్ ఫోన్‌తో సమంతకు లేనిపోని చిక్కులు.. చుక్కలు చూపించారట.. తప్పని పరిస్థితుల్లో ఏం చేసిందంటే!


రోజులు మారాయి, ఒకప్పటిలా లేదు లోకం.. టెక్నాలజీ విస్తృతం కావడంతో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కామన్ అయింది. ఇక లేటెస్ట్‌గా వస్తున్న ఫోన్లలో ఎన్నో ఫీచర్స్ వినియోగదారులను అట్రాక్ట్ చేస్తున్నాయి. అసలు మన మొబైల్‌లో అవతలివారి ఫోన్ నెంబర్ లేకపోయినా సరే.. ట్రూ కాలర్ లాంటి అప్లికేషన్స్ సహాయంతో ఫోన్ లిఫ్ట్ చేయకుండానే అదెవరో తెలుసుకునే వీలు కలిగింది. అయితే ఇలాంటి సదుపాయాలే తనకు లేనిపోని తలనొప్పులు తెచ్చాయని అంటోంది స్టార్ హీరోయిన్ . సెల్ ఫోన్‌తో పడిన చిక్కులు అన్నీఇన్నీ కావని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలిపింది. అక్కినేని కోడలిగా, స్టార్ హీరోయిన్‌గా భారీ ఫాలోయింగ్ సంపాదించి మంచి జోష్‌లో ఉంది సమంత. అలాంటి సమంత ఫోన్ నెంబర్ దొరకాలే గానీ ఎవరు మాత్రం ఊరుకుంటారు చెప్పండి. వెంటనే ఆమెకు కాల్ చేయడం, మెసేజ్ చేయడం లాంటివి చేస్తుంటారు. అలాంటి కాల్స్, మెసేజీలతో లేనిపోని ఇబ్బందులు పడిందట సమంత. చెప్పలేనన్ని ఫేక్ కాల్స్, మెసేజెస్‌తో చుక్కలు చూశానని ఆమె పేర్కొంది. ఫుడ్ ఆర్డర్ చేసుకున్నా, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నా కస్టమర్ కేర్ నుంచి కాల్స్ రావడం, మీరు ఆ సమంతనేనా అని అడగటం లాంటి చేస్తూ డిస్టర్బ్ చేసేవారని చెప్పింది సామ్. Also Read: అంతటితో ఆగక ఆ తర్వాత మెసేజీలు చేస్తూ బుర్ర తినేసేవారని సామ్ చెప్పుకొచ్చింది. దీంతో విసుగుచెంది తన ఫోన్ నెంబర్ ఎన్నో సార్లు మార్చానని, అయినా తిరిగి కొన్ని రోజులకు అదే పరిస్థితి ఎదురయ్యేదని ఆమె తెలిపింది. పర్సనల్ నెంబర్ ఎక్కడా ఇవ్వకపోయినా కూడా వాళ్లకు ఎలాగోలా తెలిసిపోయి ఫోన్ చేసే వాళ్ళని సమంత చెప్పింది. ఇకపోతే ఈ మధ్యకాలంలో పూర్తిగా బిజినెస్ రంగంపై ఫోకస్ పెట్టానని చెప్పుకొచ్చింది సమంత. సినిమాలతో పాటు ఇతర రంగాలను కూడా ఫోకస్ చేస్తూ ఆల్‌ రౌండ్ ప్రతిభ చూపుతున్న సామ్.. ఇటీవలే ఫ్యాషన్ రంగంలో కొత్త వ్యాపారం స్టార్ట్ చేసింది. 'సాకీ' పేరుతో మహిళల ఫ్యాషన్ దుస్తులను అందుబాటులోకి తీసుకొస్తోంది సామ్. ఈ మేరకు అతిత్వరలో దీనిని ప్రారంభించబోతున్నట్లు పేర్కొంది. అలాగే చిన్నపిల్లల కోసం 'ఏకం' ప్రీ స్కూల్ రెడీ చేసిన ఆమె మరి కొద్దిరోజుల్లోనే ఈ స్కూల్ ప్రారంభించనుంది.


By September 18, 2020 at 07:15AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/samantha-akkineni-faced-many-problems-with-her-cell-phone/articleshow/78178966.cms

No comments