భారత శాటిలైట్ వ్యవస్థపై చైనా సైబర్ దాడులు.. డ్రాగన్ గుట్టురట్టు చేసిన అమెరికా
భారత ఉపగ్రహ సమాచార వ్యవస్థపై 2007 నుంచి చైనా సైబర్ దాడులకు పాల్పడుతోందని అమెరికా తాజా నివేదిక వెల్లడించింది. ఇందులో 2017లో చోటుచేసుకున్న భారత ఉపగ్రహ సమాచార మార్పిడిపై సైబర్ దాడి ఒకటని తెలిపింది. చైనా అంతరిక్ష ప్రయోగాలు, ఇతర అంశాలను పరిశీలించే అమెరికాకు చెందిన చైనా ఏరోస్పేస్ స్టడీస్ ఇన్‌స్టిట్యూట్ (సీఏఎస్ఐ) నివేదిక దీనిని బయటపెట్టింది. నిరంతరం సైబర్ దాడుల ముప్పును అంగీకరించిన ఇస్రో.. ఈ విషయంలో రాజీపడబోమని పేర్కొంది. 2012 నుంచి 2018 వరకు అనేక సార్లు సైబర్ దాడులకు చైనా పాల్పడిందని, ఒక్కసారి మాత్రమే ఇది విజయవంతమైందని వివరించింది. జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ (జేపీఎల్)పై 2012లో సైబర్ దాడికి యత్నించిన చైనా.. జేపీఎల్ నెట్‌వర్క్స్‌ను తన పరిధిలోకి తెచ్చుకున్నట్టు వివిధ వర్గాలు వెల్లడించాయని తెలిపింది. శత్రువుల ఉపగ్రహాలను నాశనం చేసే యాంటీ-శాటిలైట్ (ఏ-శాట్)ను భారత్ 2019 మార్చి 27న ప్రయోగించింది. ‘కైనెటిక్ కిల్’ను విజయవంతంగా నింగిలోకి పంపింది. కానీ, కౌంటర్-స్పేస్ టెక్నాలజీలు చైనా వద్ద ఉన్నాయని, ఇవి భూమి నుంచి జియోసింక్రోనస్ కక్ష్య (జీఈఓ) మధ్య శత్రువుల అంతరిక్ష వ్యవస్థలపై నిఘా కోసమే వీటిని ప్రయోగించిందని సీఏఎస్ఐ నివేదిక పేర్కొంది. వీటిలో యాంటీ శాటిలైట్ మిసైల్స్ కో-ఆర్బిటల్ శాటిలైట్స్, లేజర్ ఆయుధాలు, జామర్లు, సైబర్ వ్యవస్థలు ఉన్నాయి. యుఎస్ వైమానిక దళం చీఫ్, స్పేస్ ఆపరేషన్ చీఫ్, వైమానిక, అంతరిక్ష విభాగాల సీనియర్ అధికారులు సీఏఎస్ఐలో భాగస్వాములుగా ఉంటారు. అమెరికా రక్షణ శాఖ, ప్రభుత్వంలో పరిశోధన నిపుణులు, విశ్లేషణాత్మక నిర్ణయాలు తీసుకునే విధాన రూపకర్తలను అందజేస్తుంది. ఇటీవల కాలంలో పెంటగాన్ నివేదిక ఫలితాలను సీఏఎస్ఐ భర్తీ చేస్తుంది. ఇతర దేశాల సాంకేతిక పరిజ్ఞానాన్ని తస్కరించి, వాటిని అభివృద్ధి చేస్తోందని నివేదిక పేర్కొంది.
By September 23, 2020 at 11:45AM
No comments