Breaking News

ముక్కు ద్వారా కరోనా టీకా సరఫరా.. వాషింగ్టన్ వర్సిటీతో భారత్ బయోటెక్ ఒప్పందం


కోవిడ్-19కు వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన దేశీయ ఫార్మ దిగ్గజం భారత్ బయోటెక్.. వాషింగ్టన్ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చకుంది. అమెరికా, జపాన్, ఐరోపా మినహా మిగతా దేశాల్లో నాజిల్ స్ప్రే వ్యాక్సిన్ సరఫరాకు అనుమతి తీసుకున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. కోవిడ్-19కు ముక్కు ద్వారా వ్యాక్సిన్‌పై స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తల పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇక, అభివృద్ధి చేసిన కోవిడ్-19 వాక్సిన్ తొలి దశ క్లినికల్ ట్రయల్స్ సెయింట్ లూయిస్ యూనివర్సిటీలో కొనసాగుతున్నాయి. ప్రయోగాలకు అవసరమైన రెగ్యులేటరీ అనుమతి పొందిన తరువాత దేశంలో మరిన్ని దశలను కొనసాగించి, పెద్ద ఎత్తున టీకా ఉత్పత్తి చేయాలని భావిస్తోంది. ‘విన్నూత్న వ్యాక్సిన్ కోసం కలిసి పనిచేయడం గర్వంగా భావిస్తున్నాం.. ఒక్క బిలియన్ టీకా డోస్‌లను ఉత్పత్తి చేయాలని భావిస్తున్నాం.. ముక్కు ద్వారా ఇచ్చే ఈ వ్యాక్సిన్ వల్ల సూది, సిరంజి వంటి పరికరాల వాడకాన్ని తగ్గించడం మాత్రమే కాదు, టీకా ఉత్పత్తిలో మొత్తం వ్యయాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. వైరల్ వ్యాక్సిన్లు, ఉత్పాదక సామర్థ్యాలు, పంపిణీలో మా అనుభవం.. సురక్షితమైన, సమర్థవంతమైన, ప్రభావవంతమైన వ్యాక్సిన్ తయారీకి ఉపకరిస్తుంది.. కోవిడ్ -19కు అవసరమైన టీకాను అందించడానికి విభిన్నమైన మంచి ప్రాజెక్టులలో భాగస్వామ్యం కావడం భారత్ బయోటెక్ గౌరవంగా భావిస్తుంది’ అని ఈ సంస్థ సీఈఓ కృష్ణ ఎలా అన్నారు. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ముక్క ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ ఎలుకలపై ప్రయోగం విజయవంతమైనట్టు ప్రముఖ సైన్స్ జనరల్ నేచురల్‌లో ఫలితాలను ప్రచురించారు. ‘ముక్కు ద్వారా ఇచ్చే ఒక్క డోస్‌తోనే సమర్ధవంతమైన వ్యాధినిరోధక సాధించే అవకాశం కలుగుతుంది.. విస్తృత స్థాయిలో సులభంగా అందజేయవచ్చు.. ఇది కరోనా నుంచి రక్షించడమే కాదు.. ప్రధానంగా ముక్కు, గొంతు కణాల ద్వారా వ్యాధి వ్యాప్తిని నిరోధిస్తుంది. ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న చాలా ఇతర టీకాలు అలా చేయలేవు’ అని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకుడు డేవిడ్ టీ క్యూరేయల్ అన్నారు. ముక్కు ద్వారా చుక్కల మందు రూపంలో వేసే టీకాను భారత్‌ బయోటెక్‌ రూపొందించింది. కోరోఫ్లూ పేరుతో పిలిచే ఈ టీకాను యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్‌ మాడిసన్‌, ఫ్లూజెన్‌ అనే వ్యాక్సిన్‌ కంపెనీలతో కలిసి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఈ టీకా హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించింది.


By September 23, 2020 at 12:29PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/hyderabad-based-pharma-bharat-biotech-inks-licensing-deal-with-washington-university-for-intranasal-vaccine/articleshow/78270949.cms

No comments