Breaking News

లింకన్ తల వెంట్రుకలు వేలం: రికార్డుస్థాయిలో అమ్మకం.. ఎన్ని లక్షలకు కొన్నారంటే?


అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్‌ తల వెంట్రుకలు, రక్తపు మరకలతో తడిసిన ఓ టెలిగ్రామ్‌ను శనివారం వేలం వేయగా.. ఓ వ్యక్తి 81వేల డాలర్లు (దాదాపు రూ. 60 లక్షలు)కు వాటిని దక్కించుకున్నాడు. అబ్రహం లింకన్‌ 1865 ఏప్రిల్‌ 15న హత్యకు గురయ్యారు. జాన్‌ లిక్స్‌ బూత్‌ అనే వ్యక్తి ఆయనను హత్య చేశాడు. ఆ తర్వాత లింకన్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు అంగుళాల పొడువున్న ఆయన తల వెంట్రుకలను కొన్నింటిని కత్తిరించి పరీక్షలు నిర్వహించారు. అనంతరం వాటిని లింకన్‌ భార్య మ్యారిటోడ్ లింకన్ సోదరుడు డాక్టర్‌ లిమన్‌ బీచర్‌టోడ్‌కు అప్పగించారు. ఆ సమయంలో వాటిని ఉంచడానికి అందుబాటులో ఏమీ కనిపించకపోవడంతో లిమన్‌ తన జేబులో ఉన్న ఓ టెలిగ్రామ్‌ను తీసి అందులో చుట్టి భద్రపర్చారు. దానిపై ‘’అని పెన్సిల్‌తో రాసిపెట్టారు. ఇటీవల వాటిని బోస్టన్‌కు చెందిన ఆర్ఆర్ సంస్థ వేలం వేయడంతో ఓ వ్యక్తి 81వేల డాలర్లకు కొనుగోలు చేశాడు. లిమన్ భద్రపరిచిన తలవెంట్రుకల గురించి ఆయన కుమారుడు జేమ్స్ టాడ్ 1945 ఫిబ్రవరి 12న వివరాలను వెల్లడించారు. పోస్ట్‌మార్టం సమయంలో లింకన్ తల వెంట్రుకలను కత్తిరించారు.. అప్పటి నుంచి మా కుటుంబం వాటిని భద్రంగా ఉంచింది అని జేమ్స్ తెలిపాడు. లింకన్ హత్యకు గురైన వార్తను టాడ్‌కు టెలిగ్రామ్ ద్వారా పంపారు. లింకన్ చనిపోయిన తర్వాత రాత్రి 11.00 గంటలకు దానిని పంపినట్టు తెలుస్తోంది. లింకన్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత టాడ్‌ను లెగ్జింటన్ పోస్ట్‌మాస్టర్‌గా నియమించారు.


By September 16, 2020 at 08:02AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-former-president-abraham-lincolns-lock-of-hair-sells-for-more-than-81000-at-auction/articleshow/78138593.cms

No comments