వైసీపీ ఎమ్మెల్యే ఇంటి వద్ద తుపాకీతో అనుమానితులు.. కడపలో కలకలం
ఎమ్మెల్యే ఇంటి సమీపంలో అనుమానితులు తుపాకీతో దొరికిపోవడం జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే, టీటీడీ పాలకమండలి సభ్యుడు ఇంటి సమీపంలో అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజంపేట మండల పరిధిలోని బోయినపల్లి నివాసం సమీపంలో గత రాత్రి కొందరు మద్యం తాగుతుండగా పెట్రోలింగ్ పోలీసులు అక్కడికి వెళ్లారు. పోలీసులను చూసిన దుండగులు అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. గ్యాంగ్‌ని పెట్రోలింగ్ పోలీసులు వెంబడించడంతో నలుగురు చిక్కినట్టే చిక్కి పరారయ్యారు. ఒకరు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. వారి వద్ద తుపాకీ ఉండడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే జిల్లా ఎస్పీకి సమాచారం అందించారు. మొత్తం ఆరుగురు సభ్యుల ముఠా అక్కడ మద్యం తాగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పరారైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. Also Read: అనుమానితుల్లో కొందరు అనంతపురం జిల్లాకి చెందిన వారు కాగా.. మరికొందరు పులివెందుల ప్రాంతానికి చెందిన వారిగా తెలుస్తోంది. ఆ సమయంలో అక్కడ ఎందుకున్నారు? ఎవరి కోసం ఉన్నారు? తుపాకీతో పాటు బుల్లెట్లు ఎందుకు తెచ్చారు? వంటి విషయాలపై జిల్లా పోలీసులు అన్ని కోణాలు దర్యాప్తు చేపట్టారు. పట్టుబడిన వ్యక్తి కాలు సరిగ్గా లేకపోవడం వల్లే దొరికిపోయినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంటి సమీపంలో అనుమానితులు దొరకడం కడప జిల్లాలో చర్చనీయాంశమైంది. Read Also:
By September 24, 2020 at 10:50AM
No comments