ఆటలో తండ్రి చీటింగ్.. కోర్టుకెక్కిన కూతురు
ఆడుతున్న ఆటలో తనను తండ్రి చీట్ చేశాడని ఓ కూతురు కోర్టెకెక్కింది. ఈ విచిత్రకరమైన పరిణామం రాజధాని భోపాల్‌లో చోటు చేసుకుంది. 24 ఏళ్ల యువతి తన తండ్రికి వ్యతిరేకంగా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఆ యువతి తన ఫిర్యాదులో తన తండ్రి లూడో ఆటలో తనను చీట్ చేశాడని ఆరోపించింది. దీంతో ఫ్యామిలీ కోర్టు కౌన్సెలర్ ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ యువతి తెలిపిన వివరాల ప్రకారం తండ్రితో ఆమె లూడో ఆడుతుండగా, అతను తప్పుగా ఆడి, ఆమెను చీట్ చేశాడని పేర్కొంది. Read More: ఈ సందర్భంగా కూతురు మాట్లాడుతూ తన తండ్రిపై తనకు ఎంతో నమ్మకం ఉందని తెలిపింది. అలాంటి ఆయన ఆటలో తండ్రి మోసం చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ఆమె వాపోయింది. తాను లూడో సరిగానే ఆడుతున్నప్పటికీ, తండ్రి సవ్యంగా ఆడలేదని ఆమె ఆరోపించింది. అందుకే ఫ్యామిలో కోర్టులో ఫిర్యాదు చేశానని పేర్కొంది. ఈ సందర్భంగా కోర్టు కౌన్సెలర్ మాట్లాడుతూ ఆ యువతికి కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నామన్నారు. ఇప్పటివరకూ నాలుగుసార్లు కౌన్సెలింగ్ ఇచ్చామని తెలిపారు. కౌన్సెలర్ మాట్లాడుతూ ఆమె ఆనందం కోసం తండ్రి ఓడిపోతే బాగుండునని ఆమె భావిస్తున్నదని తెలిపారు. అయితే కూతురుకు నాలుగు రౌండ్ల కౌన్సెలింగ్ తరువాత ఆమె పాజిటివ్‌గా స్పందించిదని కౌన్సెలర్ పేర్కొన్నారు.
By September 27, 2020 at 08:54AM
No comments