Breaking News

ఆ విషయం అడిగాడని.. అన్నని చంపేసిన చెల్లెలు.. గుంటూరులో దారుణం


భర్తతో మనస్పర్థల కారణంగా పుట్టింటికి వచ్చేసిన చెల్లెలు దారితప్పింది. మరొకరితో చనువుగా ఉండడం గమనించిన అన్న అదే విషయమై ప్రశ్నిస్తున్నాడని ఘాతుకానికి పాల్పడింది. ఏకంగా అన్నని కిరాతకంగా రోకలిబండతో మోది హత్య చేసింది. జిల్లా బేతపూడిలో ఈ దారుణం జరిగింది. బేతపూడి పరిధిలోని రేగులగడ్డకు చెందిన గంజి సాంబయ్య, నాగమ్మ దంపతులకు కుమారుడు పోతురాజు, కూతరు ఆదిలక్మి సంతానం. ఇద్దరికీ వివాహాలు జరిపించారు. పోతురాజుకు గార్లపాడుకు చెందిన మహిళతో వివాహమైంది. తాగుడుకు బానిసగా మారడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. కూతురు ఆదిలక్ష్మికి తిరులకొండకు చెందిన నాగరాజుతో వివాహం జరిగింది. వారి మధ్య మనస్పర్ధలు రావడంతో ఆదిలక్ష్మి పుట్టింటికి వచ్చేసింది. అదే గ్రామానికి చెందిన సాంబయ్య అనే వ్యక్తితో పెట్టుకుంది. ఆ విషయం అన్న పోతురాజుకు తెలియడంతో ఇంట్లో నుంచి వళ్లిపోవాలంటూ ఒత్తిడి చేసేవాడు. ఇంటి నుంచి వెళ్లిపోవాలని పలుమార్లు అన్న హెచ్చరించడంతో పాటు ఆస్తి తనకే ఇవ్వాలంటూ తల్లిదండ్రులను కూడా బెదిరించేవాడు. అది మనసులో పెట్టుకున్న చెల్లెలు దారుణానికి ఒడిగట్టింది. మద్యం మత్తులో ఇంటికి వచ్చిన పోతురాజు మరోమారు ఆస్తి విషయమై గొడవపడ్డాడు. ఈ క్రమంలో పోతురాజుకు, సాంబయ్య మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఘర్షణలో పోతురాజు కిందపడిపోవడంతో తలకు గాయమైంది. Read Also: గాయపడిన అన్న తమను ఏమైనా చేస్తాడేమోనని భయపడిన చెల్లెలు తన ప్రియుడు సాంబయ్యతో కలసి అమానుషంగా అంతమొందించింది. అందరూ నిద్రిస్తున్న సమయంలో అన్న తలపై రోకలి బండతో కొట్టడంతో పోతురాజు అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు చెల్లెలు ఆదిలక్ష్మిని, ఆమెకు సహకరించిన సాంబయ్యని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. Also Read:


By September 26, 2020 at 11:05AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-kills-brother-over-extramarital-affair-in-guntur/articleshow/78329595.cms

No comments