Breaking News

కరోనా భారతం.. 50 లక్షలు దాటిన కేసులు, 82 వేలకుపైగా మరణాలు


భారత్‌లో కేసుల సంఖ్య 50 లక్షలు దాటింది. గత 24 గంటల్లో దేశంలో 90,123 కొత్త కేసులు నమోదు కాగా.. 1290 మంది కోవిడ్ కారణంగా చనిపోయారు. ప్రస్తుతం మన దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 50,20,360కు చేరగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 9.95 లక్షలుగా ఉంది. 39.4 లక్షల మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. 82 వేల మందికిపైగా వైరస్ కారణంగా చనిపోయారని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 15 వరకు మన దేశంలో 5 కోట్ల 94 లక్షలకుపైగా శాంపిళ్లను పరీక్షించారు. మంగళవారం ఒక్క రోజే 11.16 లక్షల శాంపిళ్లను టెస్టు చేశామని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకటించింది. మన దేశంలో వారం రోజుల్లో సగటున 93,334 కరోనా కేసులు నమోదయ్యాయి. అమెరికాలో కోవిడ్ గరిష్టంగా జూన్ 25న 69,373 కరోనా కేసులు నమోదయ్యాయి. 30 రోజుల క్రితం మన దేశంలో వారం రోజుల సగటు కేసుల సంఖ్య 61,933గా ఉంది. ప్రస్తుతం ఇది 50.7 శాతం పెరగడం గమనార్హం. మన దేశంలో మరణాలు రేటు తక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశం. భారత్‌లో కోవిడ్ మరణాల రేటు 1.64 శాతం ఉండగా.. అమెరికాలో 2.95 శాతం, బ్రెజిల్‌లో 3.04 శాతంగా ఉంది. ప్రపంచ కోవిడ్ మరణాల సగటు 3.16 శాతంగా ఉంది. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో అమెరికా అగ్రస్థానంలో ఉండగా.. భారత్ రెండో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. అమెరికాలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 68 లక్షలకు చేరువలో ఉంది. ఆ దేశంలో ఇప్పటి వరకూ 2 లక్షల మందికిపైగా కోవిడ్ కారణంగా చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 మిలియన్ల కరోనా కేసులు నమోదు కాగా.. సుమారు 9.4 లక్షల మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.


By September 16, 2020 at 09:45AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-cases-in-india-crosses-rs-50-lakhs-mark/articleshow/78139952.cms

No comments