Breaking News

Vangapandu Prasada Rao: ఆయన మరణం తీరని లోటు.. వంగపండు మృతిపై ఆర్. నారాయణ మూర్తి రియాక్షన్


ప్రముఖ విప్లవ కవి,ప్రజా వాగ్గేయ కారుడు (77) మృతిపై సినీ నటుడు, పీపుల్స్ స్టార్ స్పందించారు. ఆయన మరణం చిత్ర పరిశ్రమతో పాటు సమాజానికీ తీరని లోటు అని పేర్కొన్నారు. వంగపండు గారు తన 'అర్ధరాత్రి స్వాతంత్య్రం' సినిమాలో గొప్ప పాటలు రాయడమే గాక పాడి నటించారు కూడా అని చెప్పారు. తాను రూపొందించిన అనేక చిత్రాలకు వంగపండు పాటలు రాశారని, తన చిత్ర విజయాల్లో ఆయన పాత్ర కీలకమైందని అన్నారు నారాయణ మూర్తి. దాసరి నారాయణరావు, టీ కృష్ణ, మాదాల రంగారావు గార్ల సినిమాలతో పాటు అనేక చిత్రాలకు వంగపండు ప్రసాదరావు పాటలు రాశారని, ఆయన మరణం చిత్ర పరిశ్రమకే కాదు.. తెలుగు పీడిత ప్రజానీకానికి, సమాజానికీ తీరని లోటు అని ఆర్. నారాయణ మూర్తి తెలిపారు. వంగపండు మృతి పట్ల సంతాపం తెలుపుతూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నానని అన్నారు. ఈ రోజు (ఆగస్టు 4) తెల్లవారు జామున విజయనగరం జిల్లా పార్వతీపురంలోని తన స్వగృహంలో వంగపండు ప్రసాదరావు తుది శ్వాస విడిచారు. ఉత్తరాంధ్ర జానపదులను తెలుగు నేలన విస్తృతంగా ప్రచారం కల్పించడంలో వంగపండు చేసిన కృషి చెప్పుకోదగినది. దాదాపు ఆయన 300 పాటలను రాయగా కొన్ని చిరస్థాయిగా నిలిచిపోయాయి. వందలాది జానపద పాటలను రచించడమే కాకుండా వాటికి గజ్జెకట్టి ఆడి పాడి అలరించారు వంగపండు ప్రసాదరావు. ఆయన మృతి పట్ల తెలుగు రాష్ట్రాల్లోని జానపద కళాకారులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.


By August 04, 2020 at 10:28AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/r-narayana-murthy-condolence-on-vangapandu-prasada-rao-death/articleshow/77343670.cms

No comments