Breaking News

Pragathi: అమ్మాయిలు అందంగా కనిపిస్తే వదలరు! ఓపెన్ అయిన ప్రగతి.. క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు


సినీ ఇండస్ట్రీకి పట్టిన భూతం క్యాస్టింగ్ కౌచ్. అవకాశాల పేరుతో అమ్మాయిలను లైంగికంగా లొంగ దీసుకుంటున్నారంటూ గత కొంతకాలంగా పెద్ద ఎత్తున వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయమై సంచలన తార శ్రీ రెడ్డి పెద్ద ఉద్యమమే లేవనెత్తి టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. దీంతో తమకు జరిగిన అన్యాయాలు, కెరీర్‌లో సంగతులపై ఒక్కొక్కరుగా నోరు విప్పడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే తాజాగా నటి చేసిన కామెంట్స్ సెన్సేషన్ అవుతున్నాయి. గత కొన్ని రోజులుగా తన వర్కవుట్స్, డాన్స్ వీడియోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది ప్రగతి. దీంతో సినిమాల్లో తల్లిగా, అక్కగా కనిపించే ప్రగతికి.. సోషల్ మీడియాలో పిచ్చెక్కించే ప్రగతికి చాలా తేడా ఉందని ఫిక్సయ్యారు నెటిజన్లు. తన హాట్ హాట్ వర్కవుట్స్ వీడియోలు పోస్ట్ చేస్తూ ఫాలోయింగ్ అమాంతం పెంచుకుంది ప్రగతి. కాగా తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె.. సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్, తన వ్యక్తిగత జీవితం, సినీ కెరీర్ ఇలా ప్రతీ ఒక్క అంశంపై రియాక్ట్ అయింది. Also Read: ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్‌పై ప్రగతి స్పందించిన తీరు జనాల్లో చర్చనీయాంశంగా మారింది. పెద్ద హీరోయిన్లు, ఓ స్థాయికి వెళ్లిన హీరోయిన్లందరూ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదనే చెబుతారు, తమ కెరీర్‌లో అలాంటి అనుభవమే ఎదురుకాలేదని అంటారు కానీ.. ఇండస్ట్రీలో ఎవరైతే సక్సెస్ కాలేదో వారి నుంచే ఎక్కువగా క్యాస్టింగ్ కౌచ్‌ ఫిర్యాదులు వస్తాయని పేర్కొంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది ప్రగతి. ప్రస్తుతం అమ్మాయిల కోసమే సినిమాలు తీసే పరిస్థితి వచ్చిందని, అమ్మాయి అందంగా ఉంటే చాలు దర్శకనిర్మాతలు వెంటనే అప్రోచ్ అవుతున్నారంటూ కొత్త చర్చలకు తెరలేపింది ప్రగతి. కాకపోతే క్యాస్టింగ్ కౌచ్ లాంటి అనుభవం ఎదురైనప్పుడు ఎలా రియాక్ట్ కావాలనేది ఆ వ్యక్తి మీదే ఆధారపడి ఉంటుందని ఆమె చెప్పింది. తన విషయంలోనూ అలాంటి సంఘటనలు ఎదురయ్యాయని, అయితే అలాంటి అవకాశాలు వద్దనుకుని తప్పుకున్నానని ఆమె తెలిపింది. మొత్తానికైతే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ ఓ క్లారిటీ ఇచ్చింది ప్రగతి.


By August 02, 2020 at 10:31AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-pragathi-shocking-comments-on-casting-couch/articleshow/77311574.cms

No comments