Breaking News

Namrata Shirodkar: ఆయన ఇంట్లో లేడంటే..! మరో సీక్రెట్ బయటపెట్టిన మహేష్ సతీమణి నమ్రత


నాలుగు పదుల వయసు దాటినా ఆకట్టుకునే ఫిట్‌నెస్‌తో ఇరవై ఏళ్ల కుర్రాడిలా హ్యాండ్సమ్‌గా మెరిసిపోతున్నారు మహేష్ బాబు. అయితే ఆ ఫిట్‌నెస్‌ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? మహేష్ ఇప్పటికీ టీనేజ్ కుర్రాడిలా ఉండటానికి కారణం ఏంటి? సరిగ్గా ఆ పాయింట్ క్యాచ్ చేస్తూ తాజాగా మరోసారి ఆ రహస్యాన్ని బయటపెట్టేసింది ఆయన సతీమణి . సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు మహేష్ విశేషాలు పోస్ట్ చేసే నమ్రత.. తాజాగా జిమ్ చేస్తున్న వీడియో షేర్ చేసి ఆసక్తికర కామెంట్ చేసింది. Also Read: ''ఇదే మహేష్ ఇంటి జిమ్.. ఇక్కడ ఆయన చేసే పని ఇది. అతని పుట్టినరోజు బహుమతి.. మాస్టర్స్ డెన్. మీ అందరికీ తెలుసు ఆయన ఇంట్లో లేడంటే ఎక్కడుంటారనేది'' అని ట్యాగ్ చేస్తూ మహేష్ వర్కవుట్ వీడియో షేర్ చేసింది నమ్రత. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'మహేష్ వర్కవుట్స్ సూపర్.. ఆయన ఫిట్‌నెస్ ఇంకా సూపర్.. అందుకే ఆయన సూపర్ స్టార్' అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతోంది. గతంలో కూడా ఓ సారి మహేష్ హోమ్ జిమ్‌ని సూపర్ స్టార్ అభిమానులకు చూపించి తన భర్త ఫిట్‌నెస్ సీక్రెట్ బయటపెట్టింది నమ్రత. ఇక మహేష్ సినిమాల సంగతి చూస్తే.. ఈ ఏడాది ఆరంభంలోనే 'సరిలేరు నీకెవ్వరు' అనిపించుకుంటూ ఇండస్ట్రీ హిట్ సాధించిన మహేష్, ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' మూవీ చేస్తున్నారు. మైత్రీ మూవీస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14రీల్స్‌ ప్లస్‌ పతాకాల సంయుక్త సమర్పణలో నవీన్‌ యర్నేని, రవిశంకర్, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలుగా ఈ మూవీ రూపొందనుంది. ఇటీవలే విడుదలైన ఈ మూవీ టైటిల్ లుక్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకుంది. అతిత్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుంది.


By August 20, 2020 at 10:55AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/namrata-shirodkar-shared-mahesh-babus-gym-video-goes-viral/articleshow/77648432.cms

No comments