Breaking News

Nagababu: కాబోయే అల్లుడిపై నాగబాబు కామెంట్.. నిహారిక నిశ్చితార్థం తర్వాత మెగా బ్రదర్ షాకింగ్ రియాక్షన్


మెగా వారింట పెళ్లి సందడి అఫీషియల్‌గా స్టార్ట్ అయింది. మెగా డాటర్, కుమార్తె నిహారిక నిశ్చితార్ధ వేడుకను ఆగస్టు 13 (గురువారం) సాయంత్రం కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా నిర్వహించారు. ఈ వివాహ నిశ్చితార్థ వేడుకకు మెగా హీరోలంతా హాజరై సందడి చేశారు. చిరంజీవి, రామ్ చరణ్, , సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, కళ్యాణ్ దేవ్, అల్లు అర్జున్, ఉపాసన, సురేఖ, శ్రీజ, సుస్మిత అందరూ ఈ మెగా వేడుకలో భాగమయ్యారు. అయితే ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రం ఈ వేడుకలో కనిపించకపోవడం గమనార్హం. Also Read: ప్రస్తుతం నిహారిక నిశ్చితార్ధ వేడుకకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగా కుటుంబాన్ని ఒకే ఫ్రేమ్‌లో చూసి తెగ మురిసిపోతున్నారు ఫ్యాన్స్. నిహారికకు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలుపూతూ నిహారిక- చైతన్య ఫొటోలతో సోషల్ మీడియాకు సరికొత్త కళ తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో తరువాత ఆమె తండ్రి మెగా బ్రదర్ నాగబాబు, అన్నయ్య వరుణ్ తేజ్ సామజిక మాధ్యమాల్లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ''నా బేబి సిస్టర్ నిశ్చితార్థం చేసుకుంది. వెల్‌కమ్ టు మై ఫ్యామిలీ బావా'' అంటూ తన బావకు హృదయపూర్వక స్వాగతం పలికారు వరుణ్ తేజ్. ఇక నాగబాబు రియాక్ట్ అవుతూ.. ''చాలామంది అంటుంటారు నిహారిక చాలా విషయాల్లో నాలాగే ఉంటుందని. తనపై నువ్వు అపారమైన ప్రేమను కురిపిస్తూ లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటావని బలంగా నమ్ముతున్నాను. ఇకపై అది అధికారికంగా నీ సమస్య'' అంటూ అల్లుడిపై తనదైన స్టైల్ కామెంట్ చేశారు నాగబాబు. మెగా ఇంట అల్లుడిగా అడుగుపెట్టబోతున్న జొన్నలగడ్డ చైతన్య.. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు. మెగా ఫ్యామిలీతో ఈ కుటుంబానికి ఎప్పటి నుంచో పరిచయం ఉందట. ఇండియన్ స్కూల్ బిజినెస్‌లో ఎంబీఏ పూర్తిచేసిన చైతన్య ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ఎంఎన్‌సి కంపెనీలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నారు.


By August 14, 2020 at 11:50AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nagababu-intresting-comments-on-after-niharika-chaitanya-engagement/articleshow/77539716.cms

No comments