Breaking News

Murder Movie Song: ఈ పాట వినాలనుకోవడం తప్పా? వర్మగానంపై జనం గగ్గోలు


‘‘ఏందయ్యా వర్మా.. ఇది? మా కర్మ కాకపోతే లాక్ డౌన్‌లో బోలెడు మంది సింగర్స్ పనిలేక పదో పరకో ఇచ్చినా పాడటానికి రెడీగా ఉన్నారు.. పాట పాడటం అంటే వోడ్కా బాటిల్ ఎత్తినంత ఈజీ అనుకుంటున్నావా?? లేక కొత్త కొత్త భామలతో మందేసి చిందేయడం అనుకుంటున్నావా?? పాట అంటే శృతి.. లయ... పల్లవి... చరణం... లాంటివి ఉంటాయి.. పదాలన్నీ ఇదిగో ఇలా మిక్సీలో వేసి ‘పిల్లల్ని ప్రేమించడం తప్పా’ అంటూ పాట అందుకుంటే మేం తట్టుకోలేం వర్మో’’ అంటూ వర్మ గానంపై గగ్గోలు పెడుతున్నారు నెటిజన్లు. అమృత, మారుతీ రావుల విషాద గాధపై కన్నేసిన వర్మ.. ప్రణయ్ హత్యోదంతాన్ని ప్రేక్షకుల ముందుకు ‘మర్డర్’ చిత్రంతో తీసుకువస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం నాడు ఈ మూవీ నుంచి ‘పిల్లల్ని ప్రేమించడం తప్పా’? అంటూ పాటను విడుదల చేశారు వర్మ. అయితే ఇందులో పెళ్లైన ఏడాదికే భర్తను పోగొట్టుకుని.. చిన్నబిడ్డతో రోడ్డున పడ్డ అమృత విషాధ గాధను పక్కన పెట్టిన వర్మ.. మారుతీరావు చూపించిన ప్రేమపైనే ఫోకస్ పెట్టి పాటను రాయించుకున్నారు. పిల్లల్ని ప్రేమించడం తప్పా.. తప్పు చేస్తే దండించడం తప్పా.. చెప్పుతో కొట్టడం తప్పా.. అంటూ వర్మ దృష్టితో అమృతను దండించే ప్రయత్నం చేశారు వర్మ. పనిలో పనిగా ప్రణయ్‌ని ఒక ముప్పుగా అభివర్ణించాడు వర్మ. సిర శ్రీ లిరిక్స్ అందించగా.. డీఎస్ఆర్ సంగీతం అందించారు. ఎవరు పాట రాస్తే ఏంటి?? ఎవరు ట్యూన్ ఇస్తే ఏంటి కాని.. వర్మ మాత్రం ఈ పాటను ఖూనీ చేసేశాడు అంటూ యూట్యూబ్‌లో జనం గగ్గోలు పెడుతున్నారు. వర్మ ఏంటి మాకు ఈ కర్మ.. దయచేసి మళ్లీ నువ్ పాటపాడమాకయ్యా నీకు దండం పెడతాం అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ పాటపై వస్తున్న కామెంట్లు చూస్తే పొట్టచెక్కలయ్యేలా ఉన్నాయి. ‘ఈ సాంగ్ లో అరాచకం ఏదైనా ఉంది అంటే అది RGV గాన మాధుర్యం మాత్రమే.. నీ గొంతుతో చంపేసి మా చెవులు మూసేశావ్ పో.. అందరూ కత్తులతో , తుపాకీతో చంపుతారు ... మీరు గ్రేట్ వాయిస్‌తో మర్డర్ చేసారు.. ఈ సాంగ్ ను ఈటీవీ పాడుతా తీయగా కార్యక్రమంలో సాధన చేయమని పిల్లలకు తెలియజేయండి.. సంగీతంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు.., నువ్వు ఈ పాట పాడటమే తప్పు.. అంతకు మించి ఏ తప్పూ లేదు.., శృతి... లయ... పల్లవి.... చరణం... లాంటివి లేకుండా మీరు ఈ పాట పాడటం తప్పా....??? లేక మేమే ఇలాంటి పాట వినటం మా తప్పా...??, సంగీత కళకి "కోవిడ్" సోకింది, ఇక్కడ కళని ప్రదర్శించలేదు.. ప్రయోగించినట్లు ఉంది., ఈసాంగ్ వినడమే మేం చేసిన తప్పా’.. అంటూ వర్మను ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు నెటిజన్లు.


By August 05, 2020 at 09:31AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/netizens-reaction-on-rgv-pillalni-preminchadam-thappa-lyrical-song-from-murder-movie/articleshow/77364072.cms

No comments