Breaking News

Mohan Babu: కొత్త సినిమా అనౌన్స్ చేసిన మోహన్ బాబు.. ఆసక్తి రేకెత్తిస్తున్న ఫస్ట్‌లుక్


ఈ రోజు (ఆగస్టు 15) 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తన కొత్త సినిమాను అనౌన్స్ చేశారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. గత కొన్నేళ్లుగా ఆచూతూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్న ఈ సీనియర్ యాక్టర్ ‘గాయత్రి’ మూవీ తర్వాత మరోసారి హీరోగా ఫుల్ లెంగ్త్ రోల్‌లో కనిపించలేదు. దాదాపు 560 పైగా చిత్రాల్లో నటించిన మోహన్ బాబు.. ఇకపై చేయనున్న సినిమాల్లో బలమైన కథ ఉండాలని భావిస్తున్నారట. దీంతో కోసం కథ రాయడం దర్శకులకు ఓ ఛాలెంజ్‌గా మారింది. ఈ పరిస్థితుల్లో తాజాగా తన కొత్త సినిమా '' అని ప్రకటిస్తూ ఆ మూవీ ఫస్ట్‌లుక్ కూడా రిలీజ్ చేసి అభిమానులను హూషారెత్తించారు మోహన్ బాబు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ మాటల రచయిత డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించనుండటం విశేషం. తాజాగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో మోహన్ బాబు సీరియస్ లుక్ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. Also Read: 'సన్ ఆఫ్ ఇండియా' టైటిల్‌ని బట్టి చూస్తే ఈ సినిమా దేశభక్తి ప్రధానాంశంగా తెరకెక్కనుందని స్పష్టంగా తెలుస్తోంది. మోహన్ బాబు పవర్‌ఫుల్ రోల్‌లో నటించనున్నారని, గతంలో ఎన్నడూ చూడని పాత్ర ఆయన చేస్తున్నారని అర్థమవుతోంది. కాగా స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఈ మూవీని అనౌన్స్ చేయడంతో తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అతిత్వరలో ఈ మూవీ ఇతర నటీనటుల వివరాలు ప్రకటించనున్నారు.


By August 15, 2020 at 12:29PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mohan-babu-announced-his-new-movie-son-of-india/articleshow/77559764.cms

No comments