Hyderabad: మంత్రాల పేరుతో మహిళపై రేప్.. రెండేళ్లకు చిక్కిన కీచక బాబా

మంత్రాల పేరుతో మహిళలపై అఘాయిత్యాలు పాల్పడుతున్న నకిలీ బాబా ఎట్టకేలకు చిక్కాడు. రెండేళ్ల నుంచి తప్పించుకుని తిరుగుతున్న అతడిని హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీసులు ముర్షద్ నగర్‌లో అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని రెయిన్ బజార్‌లో నివాసముండే అర్షద్ మంత్రాలతో అనారోగ్యాలు నయం చేస్తానంటూ ప్రచారం చేసుకునేవాడు. దీంతో అనేక మంది అతడిని సంప్రదించేవారు. ఈ క్రమంలోనే 2018లో ఓ మహిళ అతడి వద్దకు వెళ్లగా పూజల పేరుతో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. Also Read: తనకు శారీరక సుఖాన్ని అందిస్తే అన్ని రోగాలు, దోషాలు నయం అవుతాయని నమ్మించి ఆమెపై అనేకసార్ల అత్యాచారానికి పాల్పడ్డాడు. కొద్దిరోజులకు అర్షద్ నిజస్వరూపం తెలుసుకున్న బాధితురాలు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడి కార్యకలాపాలపై ఆరా తీయగా మరికొంతమంది మహిళలపైనా అలాగే అత్యాచారాలకు పాల్పడినట్లు తేలింది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేయడంతో పరారయ్యాడు. అప్పడి ఎన్ని ప్రాంతాలు గాలించినా ఆ నకిలీ బాబా ఆచూకీ లభించలేదు. Also Read: రెండేళ్లుగా ఎంత గాలించినా దొరకని అర్షద్ ఆదివారం కాటేదాన్ ప్రాంతానికి వచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అతడిని పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. మంత్రాల పేరుతో అతడు ఎంతమందిని మోసం చేశాడో అన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు మరింత సమాచారం కోసం అతడిని ప్రశ్నించే అవకాశాలున్నాయి. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. Also Read:
By August 24, 2020 at 07:12AM
No comments