Hyderabad: నగ్న ఫోటోలు పంపాలంటూ మహిళా న్యాయవాదికి వేధింపులు
సోషల్ మీడియా ద్వారా ఫోన్ నంబర్ సేకరించి న్యూడ్ ఫోటోలు పంపించాలంటూ మహిళా న్యాయవాదిని వేధిస్తున్న ఓ వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన దుర్గాప్రసాద్(23) అనే యువకుడు ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. పోర్న్ వీడియో వీక్షణకు బానిసై అతడు సోషల్‌మీడియా ద్వారా మహిళల ఫోన్ నంబర్లు సేకరించేవాడు. వాట్సాప్ ద్వారా వారికి అసభ్య మెసేజ్‌లు పంపిస్తూ వేధిస్తున్నాడు. Also Read: కొంతమంది వివాహితలకు వీడియో కాల్ చేస్తూ నగ్నంగా కనిపించాలని, లేకపోతే వారి ఫోటోలు, ఫోన్ నంబర్లను సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తానని బ్లాక్‌మెయిల్ చేసేవాడు. ఈ క్రమంలోనే నగరానికి చెందిన ఓ మహిళా న్యాయవాదికి తరుచూ వాట్సాప్ మెసేజ్‌లు చేస్తూ వేధిస్తున్నాడు. దీంతో విసిగిపోయిన ఆమె ఇటీవల రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితుడిని శనివారం అరెస్ట్ చేశారు. Also Read: దుర్గాప్రసాద్ గతంలోనూ ఇదే తరహా నేరాలకు పాల్పడి జైలుకెళ్లొచ్చినట్లు పోలీసులు తెలిపారు. నల్గొండ, సైబరాబాద్ పరిధిలో అతడిపై అనేక కేసులున్నాయని వెల్లడించారు. జైలుకి వెళ్లొచ్చినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదని, మహిళలను వేధించడమే పనిగా పెట్టుకున్నాడని తెలిపారు. మహిళలు సోషల్‌మీడియాలో వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేసుకుంటే ఇలాంటి అనర్థాలే వస్తాయని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ హెచ్చరించారు. Also Read:
By August 02, 2020 at 11:02AM
No comments