Breaking News

బాలికపై గ్యాంగ్ రేప్.. సెప్టిక్ ట్యాంక్‌లో తేలిన మృత‌దేహం


పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కామాంధులు ఆమెను చంపేసి సెప్టిక్ ట్యాంకులో పడేశారు. ఈ ఘోర ఘటన జల్పాయిగురి జిల్లాలో వెలుగుచూసింంది. రాజ్‌గంజ్‌లోని శైన‌షిక‌ట గ్రామానికి చెందిన బాలిక(16) ఈ నెల పదో తేదీన క‌నిపించ‌కుండా పోయింది. చుట్టుపక్కల ఎక్కడా ఆమె ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. Also Read: దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా ఆ బాలికను తామే ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశామని, ఈ విషయాన్ని ఎవరికైనా చెబుతుందన్న అనుమానంతో చంపేసి సెప్టిక్‌ ట్యాంక్‌లో పడేసినట్లు చెప్పారు. దీంతో పోలీసులు ఆ ఇంట్లోని సెప్టిక్ ట్యాంక్‌‌లో నుంచి బాలిక మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టానికి తరలించారు. Also Read: పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దోషులను బహిరంగంగా ఉరి తీయాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. బాధిత కుటుంబాన్ని స్థానిక తృణ‌మూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఖ‌గేష్‌రాయ్ పరామర్శించారు. వారికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. Also Read:


By August 23, 2020 at 10:43AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/minor-girl-gang-raped-in-west-bengal-dead-body-dumped-in-septic-tank/articleshow/77700453.cms

No comments