Breaking News

చైనాలో కరోనా మూలాలపై విచారణ.. డబ్ల్యూహెచ్‌వో ఆసక్తికర వ్యాఖ్యలు


వుహాన్ నగరంలో తొలి కేసు నమోదు కాగా.. ఇది వైరస్ నుంచి లీక్ అయ్యిందా..? లేదా సహజంగా పుట్టిన వైరసేనా అని విషయమై ఇప్పటికీ బోలెడన్ని అనుమానాలు ఉన్నాయి. అంతర్జాతీయ ఒత్తిడితో కరోనా మూలాలపై విచారణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశించిన సంగతి తెలిసిందే. వైరస్ మూలాలపై విచారణలో భాగం కావడానికి చాలా దేశాలు ఆసక్తి చూపుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో తాజాగా ప్రకటించింది. కరోనా వ్యాప్తి, జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందడానికి దారి తీసిన పరిస్థితులపై అంతర్జాతీయ బృందం అధ్యయనం చేస్తుందని డబ్ల్యూహెచ్‌వో హెల్త్ ఎమర్జెన్సీస్ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైకెల్ ర్యాన్ తెలిపారు. ఈ అంతర్జాతీయ బృందంలో భాగం కావడానికి చాలా దేశాలు ఆసక్తితో ఎదురు చూస్తున్నాయన్నారు. అంతర్జాతీయ బృందం వుహాన్ వెళ్తుంది. వైరస్ మూలాల విషయమై అధ్యయనం కోసం అక్కడి సహచరులతో కలిసి పని చేస్తుందని ర్యాన్ తెలిపారు. సహజంగా హెర్డ్ ఇమ్యూనిటీకి చేరుకోవడం అనేది ప్రమాదకరమని.. మరణాలు ఎక్కువ అవుతాయని డబ్ల్యూహెచ్‌వో కోవిడ్-19 టెక్నికల్ లీడ్ అయిన మరియా వాన్ కెర్ఖోవ్ హెచ్చరించారు. వ్యాక్సినేషన్ సురక్షితమైందన్నారు. టీకాలే జనాభాలో ఎక్కువ మందికి రక్షణనిస్తాయన్నారు. జనాభాలో 65-70 శాతం మందికి టీకా వేయడం ద్వారా ఇమ్యూనిటీ కాపాడొచ్చని.. ఇదే సురక్షితమైన విధానమని ఆయన తెలిపారు.


By August 28, 2020 at 08:22AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/many-countries-interested-to-probe-coronavirus-origins-in-china-says-who/articleshow/77796002.cms

No comments