Breaking News

మై డియర్ ఫ్రెండ్.. చిరుకు మోహన్ బాబు బర్త్‌డే విషెస్


టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇవాళ రెండు పండగలు చేసుకుంటున్నారు. వినాయక చవితితో పాటు ఇవాళ ఆయన తన పుట్టినరోజు వేడుకల్ని కూడా చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా చిరుకు కుటుంబ సభ్యులతో పాటు.. టాలీవుడ్‌ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా మంచు చిరుకు ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెస్ తెలిపారు. ‘చిరంజీవి నాకు మంచి మిత్రుడు, అతని పేరులోనే ఉంది చిరంజీవి అంటే ఆంజనేయస్వామి. అంటే ఎల్లకాలము చిరంజీవివై వర్ధిల్లుగాక. అంటే నిండు నూరేళ్ళు ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో పుట్టినరోజు జరుపుకోవాలని ఆ షిరిడీ సాయినాథున్ని కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్ ఫ్రెండ్’ అంటూ మోహన్ బాబు ట్వీట్ చేశారు. మరోవైపు చిరు బర్త్‌డే సందర్భంగా వరుణ్ తేజ్, కోడలు ఉపాసన, జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. చిరు ఇవాళ 66వ వడిలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌.. కామన్‌ డీపీ (డిస్‌ప్లే పిక్చర్‌)ని ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. చిరంజీవి కెరీర్‌ను ప్రతిబింబించేలా దీన్ని తీర్చిదిద్దారు. ఒక్కో మెట్టుపై చిరంజీవి నటించిన ప్రముఖ సినిమాల పేర్లు ఉంచుతూ డీపీని రూపొందించారు. Read More: అయితే చిరు కొన్నాళ్లు సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. చిరంజీవి కొన్నాళ్లు చిత్ర పరిశ్రమకు దూరమై.. రాజకీయాల్లో బిజీ అయిన సంగతి తెలిసిందే. ప్రజారాజ్యం పార్టీ పేరుతో కొంతకాలం ఆయన పాలిటిక్స్‌లో ప్రవేశించారు. అయితే ఆ కాలాన్ని కూడా ఈ డీపీలో చూపించడం విశేషం. ‘ఇంద్ర’-‘ఖైదీ నంబర్‌ 150’ పాత్రల మధ్యలో కొంత భాగం ఫ్లాట్‌గా రాళ్లు, మొక్కలు ఉన్నట్లు చూపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.


By August 22, 2020 at 10:36AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mohan-babu-special-birthday-wishes-to-megastar-chiranjeevi/articleshow/77687981.cms

No comments