పెళ్లి క్యాన్సిల్.. ప్రాణాలు తీసుకున్న పెళ్లికొడుకు.. కర్నూలులో విషాదం
కొద్దిరోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన యువకుడు పాడెక్కాడు. ఊహించని విధంగా అమ్మాయి కుటుంబం వివాహాన్ని రద్దు చేసుకోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. అర్ధవీడు మండలం మొహిద్దీన్‌పురానికి చెందిన వేల్పుల ఏడుకొండలు(22) కుటుంబం కొన్నేళ్ల కిందట జిల్లాలోని బేతంచర్ల వచ్చి స్థిరపడింది. అయ్యలచెర్వు ప్రాంతంలోని ఓ పాలిష్ బండల ఫ్యాక్టరీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల ఏడుకొండలికి మహానంది మండలం నందిపల్లెకి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఆగస్టు 7వ తేదీన వివాహం జరిపించాలని పెద్దలు నిర్ణయించారు. పెళ్లికి ఇంకా వారం రోజులే ఉన్న సమయంలో ఊహించని షాకిచ్చింది పెళ్లికూతురి కుటుంబం. అనివార్య కారణాలతో రెండు రోజుల కిందట పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు సమాచారమిచ్చింది. Also Read: మరో వారంలో పెళ్లి జరుగుతుందని మురిసిపోయిన యువకుడు వధువు కుటుంబం ఇచ్చిన షాక్‌తో మనస్థాపానికి గురయ్యాడు. పెళ్లి ఆగిపోయిందన్న బాధతో శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు యువకుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Read Also:
By August 01, 2020 at 02:46PM
No comments