అనంతపురం.. బాలికతో కామ కలాపాలు.. పెళ్లయిన మూడోరోజే వరుడి అరెస్ట్

పెళ్లయిన మూడోరోజు వరుడు కటకటాల పాలైన ఘటన జిల్లాలో కలకలం రేపింది. ప్రేమ పేరుతో బాలికను మోసగించిన యువకుడు ఆమెకు తెలియకుండా మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. Also Read: మండలంలోని బూదగవి గ్రామానికి చెందిన సాయి ప్రసాద్(22) అనే యువకుడు మైనర్ బాలికతో కొన్నాళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో శారీరక వాంఛలు కూడా తీర్చుకున్నాడు. ప్రియురాలితో సఖ్యతగా ఉంటూనే మూడు రోజుల క్రితం కర్నూలు జిల్లాకు చెందిన ఓ యువతిని గుట్టుగా పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు తల్లితో కలిసి ఉరవకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. Also Read: ఈ ఘటనపై గుంతకల్లు డీఎస్పీ ఖాసీం సాహెబ్ విచారణ చేపట్టి ప్రసాద్ బాలికను మోసం చేసినట్లు నిర్ధారించారు. దీంతో అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన ఉరవకొండ పోలీసులు మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి అతడికి రిమాండ్ విధించగా గుత్తి సబ్ జైలుకు తరలించారు. ప్రసాద్ వివాహం చేసుకున్న యువతికి పది రోజుల క్రితమే మైనారిటీ తీరినట్లు పోలీసులు తెలిపారు. Also Read:
By August 26, 2020 at 08:29AM
No comments