మరో కరోనా వ్యాక్సిన్‌కు చైనా అనుమతి.. ఎమర్జెన్సీ వాడకానికి మాత్రమే!

కరోనావ్యాక్ పేరిట సినోవాక్ బయోటెక్ లిమిటెడ్ రూపొందించిన వ్యాక్సిన్ క్యాండిడేట్‌ను అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి చైనా ఆమోదం తెలిపింది. కరోనా సోకే ముప్పు ఎక్కువగా ఉన్న వైద్య సిబ్బంది, ఇతరులకు ఈ టీకా వేయడానికి అనుమతులు ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి తమ వ్యాక్సిన్‌కు అనుమతులు వచ్చినట్లు చైనా నేషనల్ బయోటెక్ గ్రూప్ (సీఎన్‌బీజీ) కూడా వియ్‌చాట్ ద్వారా వెల్లడించింది. చైనా ప్రభుత్వ రంగ సంస్థ సినోఫార్మ్‌లో భాగమైన సీఎన్‌బీజీ రూపొందించిన రెండు వ్యాక్సిన్ క్యాండిడేట్లు మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నాయి. గత జులై నుంచే హై రిస్క్ ఉన్న వారికి చైనా ప్రయోగాత్మకంగా కరోనా వ్యాక్సిన్లను ఇస్తున్న సంగతి తెలిసిందే. రెండు వ్యాక్సిన్ క్యాండిడేట్లను అత్యవసరంగా ఉపయోగించడానికి జూన్‌లోనే ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు మీడియా సంస్థ జిన్హువా తెలపింది. కానీ ఆ వ్యాక్సిన్ల వివరాలను బహిర్గతం చేయలేదు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఏడు వ్యాక్సిన్లు చివరి దశ ప్రయోగాల్లో ఉండగా.. అందులో నాలుగు చైనాకు చెందినవే కావడం గమనార్హం. తుది దశ ప్రయోగాల్లోనూ వ్యాక్సిన్ సురక్షితమేనని తేలితే భారీ ఎత్తున వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం అవుతుంది.
By August 30, 2020 at 10:16AM
No comments