Breaking News

ప్రేమ వివాహం చేసుకున్న కూతురు.. కక్షతో మనవడికి చిత్రహింసలు


తమ ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ వివాహం చేసుకున్న యువతిపై తల్లిదండ్రులు కక్షగట్టారు. కోపంతో కూతురిపై దాడి చేయడమే కాకుండా మనవడిని చిత్రహింసలు పెట్టారు. ఈ ఘటన రాజధాని బెంగళూరులోని మైకోలేఔట్‌ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గురప్పనపాళ్య ప్రాంతంలో చోటుచేసుకుంది. Also Read: గురప్పనపాళ్యకు చెందిన అజీరా అనే యువతి మూడేళ్ల క్రితం ఇమ్రాన్ పాషా అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి అజీరా తల్లిదండ్రులకు ఇష్టం లేదు. దీంతో ఆ నవ జంట వేరే ప్రాంతంలో గుట్టుగా కాపురం చేసుకుంటున్నారు. వీరికి రెండేళ్ల కొడుకు ఉన్నాడు. అయితే తమ ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ పెళ్లి చేసుకున్న అజీరాపై తల్లిదండ్రులు కక్షగట్టారు. ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. అన్ని విషయాలు మరిచిపోయి ఇంటికి రావాలని కొద్దిరోజుల క్రితం వారు అజీరాను ఆహ్వానించారు. తల్లిదండ్రులు తనను మన్నించారన్న ఆనందంతో ఆమె కొడుకుతో కలిసి పుట్టింటికి వచ్చింది. Also Read: అక్కడ అజీరాను బంధించిన తల్లిదండ్రులు ఆమెపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా పసివాడిని చిత్రహింసలు పెట్టారు. శరీరంపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు. వారి నుంచి బిడ్డతో సహా తప్పించుకునిన అజీరా ఇందిరాగాంధీ ఆస్పత్రికి వెళ్లింది. తీవ్రగాయాలతో ఉన్న పసివాడికి డాక్టర్లు హుటాహుటిన వైద్యం అందించారు. అయినప్పటికీ ఆ బిడ్డ పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:


By August 30, 2020 at 09:42AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/2-yr-old-baby-boy-harassed-by-grand-parents-in-bengaluru/articleshow/77830609.cms

No comments