తాళి కట్టాక ట్విస్ట్ ఇచ్చిన వరుడు. పోలీస్‌స్టేషన్‌కు చేరిన పంచాయితీ

వేద మంత్రాల సాక్షిగా, బంధుమిత్రలు సమక్షంలో ఇష్ట పూర్వకంగా యువతికి తాళి కట్టిన వరుడు గంటల వ్యవధిలోనే ప్లేటు ఫిరాయించిన ఘటన జిల్లా మండలంలో వెలుగుచూసింది. భార్యతో తాను కాపురం చేయనని, నిశ్చితార్థం రోజున చెప్పిన విధంగా బంగారం ఇస్తేనే కలిసి ఉంటానని పట్టుబట్టాడు. అంతటితో ఆగకుండా బంధువులు తనను బెదిరించి ఇష్టం లేని పెళ్లి చేశారంటూ డయల్ 100కి ఫోన్ చేశాడు. దీంతో ఈ వివాదం పోలీస్‌స్టేషన్‌కు చేరింది. Also Read: తలుపుల మండలానికి చెందిన చిన్నాకు కదిరి మారుతినగర్‌కు చెందిన సమీప బంధువైన యువతితో పెళ్లి నిశ్చయమైంది. బంధువులందరూ కలిసి శుక్రవారం పాలబావి వద్ద గుడిలో పెళ్లి జరిపించారు. వధువుకు తల్లిదండ్రులు లేకపోవడంతో బంధువులందరూ కలిసి పెళ్లి చేయించేందుకు ముందుకు వచ్చారు. కట్నంగా మూడుతులాల బంగారం ఇస్తామని నిశ్చితార్థం రోజున బంధువులు చెప్పారు. తాళి కట్టిన గంటలోపే మొత్తం బంగారం ఇవ్వాలంటూ వరుడు మొండికేశాడు. Also Read: కొంత బంగారం ఇచ్చామని, మిగిలింది త్వరలోనే సమకూరుస్తామని, నచ్చచెప్పినా చిన్నా అంగీకరించలేదు. పాలబావి వద్ద నుంచే 100కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు బంధువులతో సహా వధూవరులను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. వధువును మైనర్‌గా అనుమానించిన పోలీసులు ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీనిపై రెండు వర్గాలతో సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని పోలీసులు తెలిపారు. Also Read:
By August 29, 2020 at 07:08AM
No comments