Breaking News

పంజాబ్ సరిహద్దుల్లో ఐదుగురు చొరబాటుదార్లను కాల్చి చంపిన సైన్యం


పంజాబ్ సరిహద్దుల్లోని ఐదుగురు చొరబాటుదారులను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కాల్చి చంపింది. పంజాబ్‌లోని భారత్-పాకిస్థాన్ వద్ద శనివారం ఉదయం ఐదుగుర్ని సైన్యం కాల్చి చంపినట్టు ఉన్నతాధికారి తెలిపారు. తరాన్ తరాన్ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు నుంచి దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తుండగా.. బీఎస్ఎఫ్‌కి 103 బెటాలియన్ దళాలు అప్రమత్తమయ్యాయని పేర్కొన్నారు. వారి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో అడ్డుకునే ప్రయత్నం చేసిందన్నారు. ఈ సమయంలో సైన్యంపై చొరబాటుదారులు కాల్పులు జరిపారని, ఆత్మరక్షణ కోసంం బీఎస్ఐ సైనికులు ఎదురు కాల్పులు జరిపినట్టు వివరించారు. ఈ కాల్పుల్లో ఐదుగురు చొరబాటుదారులు హతమైనట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున 4.45 గంటలకు చోటుచేసుకున్నట్టు మరో అధికారి పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టామని, ఆపరేషన్ కొనసాగుతోందని వెల్లడించాయి. నిరంతరం కశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉగ్రవాదులను దేశంలోకి ఎగదోసే ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో పంజాబ్‌వైపు నుంచి కూడా డ్రోన్లతో దాడులకు ప్రయత్నిస్తోంది.


By August 22, 2020 at 12:08PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/five-intruders-shot-dead-along-india-pakistan-internationl-border-in-punjab-bsf/articleshow/77689008.cms

No comments